కల్కి 2898 ఏడి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత ప్రభాస్ నటించిన ప్యాన్ ఇండియా మూవీ ది రాజా సాబ్ ఏప్రిల్ 10 విడుదలకు రెడీ అవుతోంది. ఇటీవలే డార్లింగ్ పుట్టినరోజు సందర్భంగా వదిలిన ఫస్ట్ లుక్ లో గెటప్ చూసి అభిమానులు ఆశ్చర్యంతో పాటు అనుమానం కూడా వ్యక్తం చేశారు. భలే షాకింగ్ గా ఉందని కొందరంటే దర్శకుడు మారుతీ ఇలా ట్విస్ట్ ఇచ్చారేంటని మరికొందరు అభిప్రాయపడ్డారు. ట్రోలింగ్ చేసిన వర్గాలు లేకపోలేదు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద వందల కోట్ల బడ్జెట్ తో రూపొందిన ది రాజా సాబ్ హారర్ జానర్ కావడంతో నార్త్ లోనూ క్రేజీ బిజినెస్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇదిలా ఉండగా ది రాజా సాబ్ తో చంద్రముఖి తరహా ఫార్ములా ఉంటుందని ఇన్ సైడ్ లీక్. తాత పాత్ర పోషిస్తున్న సంజయ్ దత్, ప్రభాస్ ల మధ్య జరిగే సన్నివేశాలు ఫ్లాష్ బ్యాక్ లో రాజా సాబ్ ఎపిసోడ్ కు దారి తీస్తాయని, అవి రజినీకాంత్ లకలకని మించిన మ్యానరిజంస్, హీరోయిజంతో డిజైన్ చేశారని అంటున్నారు. పోస్టర్ లో తెల్లజుట్టుతో ఉన్న పాత్రే అసలైన రాజా సాబని, ఇంకో యంగ్ లుక్ ప్రభాస్ డ్యూయల్ రోల్ తో సెకండాఫ్ లో షాక్ ఇస్తాడని మరో ట్విస్ట్ చెబుతున్నారు. ఇవన్నీ అఫీషియల్ గా ఖరారు చేయలేం కానీ నిజమైతే అభిమానులకు అంతకన్నా గూస్ బంప్స్ ఏముంటాయి.
ప్రస్తుతం చివరి దశలో ఉన్న ది రాజా సాబ్ ఫస్ట్ కాపీని ఫిబ్రవరికల్లా ఫస్ట్ కాపీ సిద్ధం చేసే లక్ష్యంతో పని చేస్తున్నారు. హారర్ జానర్ అయినప్పటికీ విఎఫ్ఎక్స్ క్వాలిటీ అత్యున్నతంగా ఉంటుందని ఊరిస్తున్నారు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లు నటిస్తున్న ఈ సినిమా మారుతీకి చాలా కీలకం. గోపీచంద్ పక్కా కమర్షియల్, అంతకు ముందు మంచి రోజులు వచ్చాయి నిరాశ పరిచినా కంటెంట్ మీద నమ్మకంతో ప్రభాస్ ఓకే చెప్పేశాడు. ఇది బ్లాక్ బస్టర్ అయితే మారుతీ నేరుగా టాప్ లీగ్ లోకి వెళ్లిపోవడం ఖాయం. దీని ఫలితం చూశాకే ఆఫర్ ఇచ్చేందుకు పలువురు స్టార్ హీరోలు ఎదురు చూస్తున్నారు.
This post was last modified on October 28, 2024 10:26 am
శంకర్.. ఒకప్పుడు ఈ పేరు చూసి కోట్లమంది కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవారు. హీరోలు కథ వినకుండానే సినిమా ఒప్పేసుకునేవారు.…
యాదృచ్చికమో లేక కాకతాళీయమో చెప్పలేం కానీ హీరో రామ్ చరణ్, నిర్మాత దిల్ రాజు మధ్య కాంబో రెండుసార్లు ఒడిదుడుకులకు…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి కంకర్యాలు, స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల బాగోగులను పర్యవేక్షఇంచేందుకు ఏర్పాటైనదే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ). ఏపీ ప్రభుత్వమే ఈ…
ఇప్పుడంతా టాలీవుడ్ లో సంక్రాంతి హడావిడి నడుస్తోంది. హిట్ టాక్ తో రెండు దూసుకుపోతున్నా బాక్సాఫీస్ డామినేషన్ మాత్రం పూర్తిగా…
తెలుగు మీడియా రంగంలో ఇప్పుడు ఏ పత్రికను చూసినా… ఏ ఛానెల్ ను చూసినా…వాటి వెనుక ఉన్న రాజకీయ పార్టీలు…
నిన్న డాకు మహారాజ్ సక్సెస్ మీట్ లో తమన్ బాగా ఎమోషనల్ అయిపోతూ సినిమాను చంపొద్దంటూ, సోషల్ మీడియాలో మరీ…