Movie News

విజయ్‌కి త్రివిక్రమ్ బూస్ట్

టాలీవుడ్లో చాలా వేగంగా స్టార్ ఇమేజ్ తెచ్చుకుని విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న నటుడు విజయ్ దేవరకొండ. పెళ్ళిచూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం, ట్యాక్సీవాలా లాంటి సక్సెస్‌లతో అతడి పేరు ఒక సమయంలో మార్మోగింది. కానీ తర్వాత వరుస ఫ్లాపులు విజయ్‌ని వెనక్కి లాగేశాయి. అందులోనూ లైగర్, ఫ్యామిలీ స్టార్ డిజాస్టర్లు కావడం విజయ్ కెరీర్‌ను బాగా దెబ్బ తీశాయి. దీంతో ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపించే విజయ్ ఈ మధ్య కొంచెం డల్ అయినట్లు కనిపిస్తున్నాడు.

తాజాగా ‘లక్కీ భాస్కర్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో కూడా విజయ్ ఒకప్పటి స్థాయిలో హుషారుగా కనిపించలేదు. తన మాటల్లో దూకుడు తగ్గింది. ఈ విషయం గమనించాడో ఏమో.. ఈ వేడుకలో పాల్గొన్న స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రౌడీ స్టార్‌కు మంచి బూస్ట్ ఇచ్చాడు.

తన ప్రసంగంలో విజయ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించి, తనను దగ్గరికి తీసుకున్న త్రివిక్రమ్.. విజయ్ తనకు ఎంతో నచ్చిన నటుడని చెప్పాడు. విజయ్ చాలా తక్కువ సమయంలో ప్రేక్షకుల నుంచి ఎంతో ప్రేమను చూశాడని.. అలాగే అంతకు రెట్టింపు ద్వేషాన్ని కూడా ఎదుర్కొన్నాడని త్రివిక్రమ్ పేర్కొన్నాడు. కానీ విజయ్ అన్నింటినీ తట్టుుకన్నాడని చెబుతూ.. “మావాడు చాలా గట్టివాడు” అని విజయ్‌ని కౌగిలించుకోవడంతో స్టేజ్, ఆడిటోరియం ఎమోషనల్‌గా మారాయి.

ప్రస్తుత విజయ్ మానసిక స్థితిని త్రివిక్రమ్ బాగా అర్థం చేసుకున్నాడని.. సోషల్ మీడియాలో అతడి మీద పనిగట్టుకుని నెగెటివిటీని చూపించిన విషయాన్ని త్రివిక్రమ్ బాగానే గుర్తించి సందర్భానుసారంగా బాగా మాట్లాడాడని.. త్రివిక్రమ్ స్థాయి వ్యక్తి ఇలా స్ట్రగుల్లో ఉన్న టాలెంటెడ్ యంగ్ హీరోకు బూస్ట్ ఇవ్వడం చాలా మంచి విషయమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. త్రివిక్రమ్ విజయ్ గురించి మాట్లాడిన వీడియోను రౌడీ ఫ్యాన్స్ సోషల్ మీడియలో వైరల్ చేస్తూ ఆయన్ని కొనియాడుతున్నారు.

This post was last modified on October 28, 2024 10:22 am

Share

Recent Posts

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

57 minutes ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

2 hours ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

2 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

2 hours ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

3 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

4 hours ago