టాలీవుడ్లో క్రేజీయెస్ట్ సీజన్ అయిన సంక్రాంతికి ఏ సినిమాలు వస్తాయనే విషయంలో ప్రతిసారీ ఉత్కంఠ నెలకొంటుంది. ఈసారి కూడా అందుకు భిన్నమేమీ కాదు. సంక్రాంతి సినిమాల విషయంలో సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. ‘గేమ్ చేంజర్’ ఒక్కటే ఈ పండక్కి రిలీజ్ డేట్ ఖరారు చేసుకుంది. బాలకృష్ణ-బాబీ సినిమా కూడా సంక్రాంతికే వస్తుందని మేకర్స్ ప్రకటించినప్పటికీ.. ఇంకా డేట్ అయితే ఇవ్వలేదు. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ కూడా ఖరారు చేయలేదు. దీపావళికి ఏమైనా టైటిల్ ప్రకటించి రిలీజ్ డేట్ కూడా చెబుతారేమో చూడాలి.
మరోవైపు ‘తండేల్’ సినిమా క్రిస్మస్ రేసు నుంచి తప్పుకుని సంక్రాంతికి వస్తుందని వార్తలు వచ్చాయి. కానీ ఆ సంగతి కూడా ఎటూ తేలలేదు. ‘తండేల్’ రేసులోకి రావడంతో చైతూ మావయ్య వెంకటేష్ సినిమా ‘సంక్రాంతికి కలుద్దాం’ (వర్కింగ్ టైటిల్) పండుగ రేసు నుంచి తప్పుకుంటుందనే ప్రచారం జరిగింది.
‘సంక్రాంతికి కలుద్దాం’ గురించి కొన్నాళ్లుగా అసలు సౌండ్ లేదు. దిల్ రాజు ఫోకస్ అంతా ‘గేమ్ చేంజర్’ మీదే నిలిచింది. సంక్రాంతికి ఒక బేనర్ నుంచి రెండు సినిమాలు రిలీజ్ కావేమో అన్న సందేహాలు కూడా కలిగాయి. కానీ రాజు వెంకీ మూవీని కూడా సంక్రాంతికే తేవడానికి సన్నాహాలు చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు గత ఏడాది ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ చిత్రాలను సంక్రాంతికే రిలీజ్ చేసి సక్సెస్ అయిన నేపథ్యంలో రాజుకు అడ్డంకి ఏమీ లేనట్లే.
‘సంక్రాంతికి కలుద్దాం’ సంక్రాంతికే రాబోతుందనే సంకేతాలను టీం కూడా ఇచ్చేసింది. ఈ రోజే ఈ మూవీకి డబ్బింగ్ పనులు మొదలయ్యాయి. 90 శాతం చిత్రీకరణ కూడా పూర్తయినట్లు ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ సందర్భంగా చిన్న వీడియో గ్లింప్స్ కూడా చూపించారు. అది చూస్తే ఇది పక్కా పండక్కి సూటయ్యే ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనిపిస్తోంది. త్వరలోనే ‘సంక్రాంతికి కలుద్దాం’ సంక్రాంతి రిలీజ్ గురించి ప్రకటన వస్తుందని భావిస్తున్నారు.
This post was last modified on October 27, 2024 5:04 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…