బాహుబలి, కేజీఎఫ్, పుష్ప లాంటి సినిమాలు దేశవ్యాప్తంగా అదరగొట్టాక.. అందరికీ పాన్ ఇండియా పిచ్చి పట్టుకుంది. మిడ్ రేంజ్, చిన్న స్థాయి హీరోలు సైతం పాన్ ఇండియా సినిమాలను ఘనంగా అనౌన్స్ చేస్తున్నారు. కానీ పోస్టర్ మీద నాలుగైదు భాషల పేర్లు కనిపిస్తున్నాయి కానీ.. ఆయా భాషల్లో నిజంగా సినిమాలు రిలీజవుతున్నాయా.. రిలీజైనా ప్రభావం చూపగలుగుతున్నాయా అంటే ‘లేదు’ అనే సమాధానమే వస్తుంది.
చాలా సినిమాలు తెలుగు వరకే రిలీజై.. మిగతా భాషల్లో అసలు విడుదలే కావడం లేదు. కొన్ని చిత్రాలు హిందీ వరకు రిలీజవుతున్నాయి. అక్కడ పెద్దగా ప్రభావం చూపడం లేదు. నాని లాంటి పేరున్న హీరో నుంచి వచ్చిన పాన్ ఇండియా మూవీస్ ‘దసరా’, ‘హాయ్ నాన్న’, ‘సరిపోదా శనివారం’ ఇతర భాషల్లో నామమాత్రంగా రిలీజయ్యాయి. ‘సరిపోదా శనివారం’ ఒక్కటి తమిళంలో కొంత ప్రభావం చూపిందంతే.
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కూడా ‘పాన్ ఇండియా’ కల కన్నాడు. తన కొత్త చిత్రం ‘క’ను తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళంలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకున్నాడు. కానీ రిలీజ్ దగ్గర పడేసరికి ఈ చిత్రం కేవలం తెలుగులో మాత్రమే విడుదల కాబోతోంది. మలయాళంలో దుల్కర్ సల్మాన్ ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి ముందుకు వచ్చాడు.
కానీ దుల్కర్ సినిమా ‘లక్కీ భాస్కర్’ కూడా అక్టోబరు 31నే రిలీజ్ అవుతుండడంతో దానికి పోటీగా ఈ చిత్రాన్ని విడుదల చేయడం కరెక్ట్ కాదని హీరో కిరణే వారించాడట. ఇక తమిళంలో ఏమో ఈ చిత్రానికి థియేటర్లు ఇవ్వలేదు.
చిన్న స్థాయిలో రిలీజ్ చేయాలని చూసినా కుదరకపోవడంతో తమిళ రిలీజ్ ప్రస్తుతానికి ఆపేశారు. హిందీలో ఈ చిత్రానికి బజ్ క్రియేట్ కాకపోవడం, డిస్ట్రిబ్యూటర్లు దొరక్కపోవడంతో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. తెలుగులో ఈ సినిమాకు మంచి టాక్ వచ్చి.. పెద్ద సక్సెస్ అయితే.. తర్వాత ఏమైనా ఇతర భాషల్లో రిలీజ్ చేస్తారేమో చూడాలి.
This post was last modified on October 27, 2024 4:02 pm
సంక్రాంతికి సొంత ఊరిలో గడిపేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం నారావారి పల్లెకు చేరుకుంది. దాదాపు నాలుగు రోజులపాటు ఆయన…
ఇటీవలే విడుదలైన సంక్రాంతి సినిమాలు ది రాజా సాబ్, మన శంకరవరప్రసాద్ గారులో ప్రభాస్ కు నాన్నమ్మగా, చిరంజీవికి తల్లిగా…
మన శంకరవరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం మొదటి రోజు ప్రీమియర్లతో…
వాహనదారులకు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రహదారులపై ట్రాఫిక్ రూల్స్కు విరుద్ధంగా వాహనాలు నడుపుతూ..…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…