ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘పుష్ప: ది రూల్’ ఒకటి. బాహుబలి, కేజీఎఫ్ తర్వాత ఆ స్థాయిలో సెకండ్ పార్ట్ కోసం ప్రేక్షకుల ఎదురు చూస్తున్నది ఈ సినిమా విషయంలోనే. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి మంచి హైపే ఉంది కానీ.. మధ్యలో రకరకాల కారణాల వల్ల సినిమా చుట్టూ నెగెటివిటీ ముసురుకుంది.
ముఖ్యంగా ఏపీలో ఎన్నికల ఫలితాలు వచ్చాక ఓ రెండు నెలల పాటు ‘పుష్ప-2’ మీద ఆన్ లైన్లో బాగా నెగెటివిటీ పెరిగిపోయింది. వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి మద్దతుగా అల్లు అర్జున్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని మెగా అభిమానులతో పాటు టీడీపీ, జనసేన మద్దతుదారుల్లో తీవ్ర వ్యతిరేకత తెచ్చుకున్నాడు. అదే సమయంలో సినిమా షెడ్యూళ్లు వాయిదా పడడం.. షూటింగ్ సజావుగా సాగకపోవడం.. ఆగస్టు 15 నుంచి ఈ చిత్రం వాయిదా పడడం.. సుకుమార్-బన్నీ మధ్య విభేదాల గురించి జోరుగా వార్తలు రావడంతో సినిమా చుట్టూ నెగెటివిటీ ముసురుకుంది.
సినిమా వాయిదా పడడానికి తోడు బన్నీ మీద నెలకొన్న నెగెటివిటీ వల్ల ‘పుష్ప-2’ అనుకున్న మేర ఆదాయం తెచ్చిపెట్టదేమో అని బయ్యర్లు భయపడే పరిస్థితి తలెత్తింది. దీంతో ముందు చేసుకున్న ఒప్పందాలను రివైజ్ చేయాలని, అంత మేర డబ్బులు కట్టాలేమనే వాదనా బయ్యర్ల నుంచి వచ్చిన పరిస్థితి. ఐతే పుష్ప-2 మేకర్స్ తర్వాత చూద్దాం అని చెప్పి కొన్ని నెలలు సైలెంటుగా ఉన్నారు. సినిమా మేకింగ్ మీద దృష్టిపెట్టారు.
సుకుమార్, బన్నీ సైతం ఇగోలు పక్కన పెట్టి, ఒక అండర్‌స్టాండింగ్‌కు వచ్చి ఈసారి డెడ్ లైన్ దాటకుండా ప్రణాళిక ప్రకారం పని చేయడం మొదలుపెట్టారు. అక్కడి నుంచి షూటింగ్ ఊపందుకుంది. టీం అంతా సినిమాను అనుకున్న సమయానికి అనుకున్న క్వాలిటీతో బయటికి తేవడానికి కష్టపడింది. బన్నీ సైలెంట్‌గా తన పని తాను చేసుకుపోయాడు. రోజులు గడిచేకొద్దీ సోషల్ మీడియాలో బన్నీ పట్ల వ్యతిరేకత తగ్గుతూ వచ్చింది. అదే సమయంలో ‘పుష్ప-2’కు హైప్ మళ్లీ పెరుగుతూ వచ్చింది. ‘పుష్ప-2’ ఔట్ పుట్ గురించి యూనిట్ సభ్యుల నుంచి బయటికి వచ్చిన ఫీడ్ బ్యాక్ సైతం సినిమాకు ప్లస్ అయింది. తాజాగా బయ్యర్లతో కలిసి ‘పుష్ప-2’ నిర్మాతలు ప్రెస్ మీట్ నిర్వహించగా.. వాళ్ల కాన్ఫిడెన్స్ మామూలుగా లేదు. రిలీజ్ టైంకి ‘పుష్ప-2’ హైప్ పీక్స్‌కు చేరే సంకేతాలు కనిపిస్తున్నాయి.
This post was last modified on October 26, 2024 5:17 am
టాలీవుడ్ సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ఆసక్తికరంగా మారిన సంగతి…
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సూపర్ హిట్ తర్వాత నవీన్ పోలిశెట్టి నుంచి మళ్ళీ ఇంకో సినిమా రాలేదు. గ్యాప్…
తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నిర్మాత దిల్ రాజు ఆధ్వర్యంలో ఈ రోజు టాలీవుడ్ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్…
జవాన్ దర్శకుడు అట్లీ బ్రాండ్ ని నిర్మాతగా వాడుకున్నారు. వరుణ్ ధావన్ అక్కడా ఇక్కడా అని లేకుండా అన్ని చోట్లా…
కేంద్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ.. ఏపీ ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీల మధ్య కొన్ని…
వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఎదగడానికి, ముఖ్యమంత్రి కావడానికి సింపతీ బాగా ఉపయోగపడిందనడంలో సందేహం లేదు. తన తండ్రి వైఎస్…