పోటీ విపరీతంగా ఉన్నప్పుడు అపోజిషన్ ని తట్టుకోవడానికి రకరకాల ఎత్తుగడలు వేయాల్సి ఉంటుంది. అందులోనూ బాలీవుడ్ రిలీజ్ కోసం టాలీవుడ్ సినిమా సహాయం అవసరం పడిందంటే అంతకన్నా కిక్ ఏముంటుంది. వివరాల్లోకి వెళ్తే అంతగా ఏముందో అర్థమవుతుంది. నవంబర్ 1 సింగం అగైన్, భూల్ భులయ్యా 3 ఒకే రోజు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. వీటికి థియేటర్ల పంపకం పెద్ద తలనెప్పిగా మారింది. అంచనాలు, హైప్ రెండింటికి ఒకే స్థాయిలో ఉండటంతో ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అని చెప్పడానికి లేకుండా పోయింది. అందుకే డిస్ట్రిబ్యూటర్ ఒక తెలివైన ఆలోచన చేశాడు.
భూల్ భులయ్యా 3 హక్కులను ఏఏ ఫిలిమ్స్ తరఫున అనిల్ తదాని తీసుకున్నారు. తమ సినిమాకు సింగల్ స్క్రీన్లు ఇస్తే కనక డిసెంబర్ 5 విడుదల కాబోయే పుష్ప 2 ది రూల్ కటవుట్ ని ఉచితంగా ఇస్తానని ఆఫర్ చేస్తున్నారట. అలాని ఏదో ఆషామాషీగా కాదండోయ్. ఏకంగా 30 అడుగులు పొడవున్న అల్లు అర్జున్ బొమ్మ. దీంతో పలువురు ఎగ్జిబిటర్లు ఈ ఆఫర్ పట్ల ఆసక్తి చూపిస్తున్నారట. పుష్ప కున్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని కటవుట్ ఫ్రీగా వస్తుందంటే పబ్లిసిటీకి ఉపయోగపడటంతో పాటు థియేటర్ కు పెద్ద ఆకర్షణ తోడవుతుంది. పుష్ప 2 హిందీ హక్కులు సొంతం చేసుకున్న అనిల్ తదాని వేసిన మాస్టర్ ప్లాన్ ఇది.
ఇదేదో బాగుంది కదూ. దీన్ని బట్టే పుష్ప మేనియా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో సమానంగా ఉత్తరాదిలోనూ విపరీతమైన హైప్ తెచ్చుకున్న బన్నీ సినిమాకు కెజిఎఫ్, కాంతార, ఆర్ఆర్ఆర్ స్థాయిలో ఓపెనింగ్స్, వసూళ్లు వస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కర్ణాటక, కేరళ అనే తేడా లేకుండా ప్రతి చోటా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. నువ్వా నేనాని కవ్వించుకుంటునప్పటికీ క్రమంగా భూల్ భూలయ్యా 3దే స్క్రీన్ కౌంట్ పరంగా పై చేయి కావొచ్చని ట్రేడ్ టాక్. ముఖ్యంగా బిసి సెంటర్స్ లో స్త్రీ 2ని మించిన భారీ స్పందన ఉంటుందని అంచనా వేస్తున్నారు.
This post was last modified on October 25, 2024 7:20 pm
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…