Movie News

అల్లు వారి స్టూడియో అందుకేనా?

గురువారం అల్లు రామలింగయ్య 99వ జయంతి సందర్భంగా ఉన్నట్లుండి అల్లు వారి కుటుంబం ‘అల్లు స్టూడియోస్’ను ఆరంభించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టూడియోల నిర్మాణం, వాటి మెయింటైనెన్స్ అంటే చిన్న విషయం కాదు. ఇప్పటికిప్పుడు అంత పెద్ద బాధ్యతను అల్లు ఫ్యామిలీ ఎందుకు నెత్తికెత్తుకుందని అందరికీ సందేహం కలిగింది. ఐతే అరవింద్ ఎంత తెలివైన వారో.. ఆయన ఏ అడుగు వేసినా అందులో ఎంత ప్రణాళిక ఉంటుందో ఇండస్ట్రీ జనాలకు తెలియంది కాదు.

అరవింద్ గత ఏడాది సొంతంగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ మొదలుపెట్టబోతున్నట్లు వార్తలు వస్తే చాలామంది పెదవి విరిచినవాళ్లే. అప్పటికే ఉన్న ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌లో ఉండే కంటెంట్, వాటి రేంజ్‌ను అంచనా వేసి.. అది చాలా పెద్ద వ్యవహారం.. లోకల్‌గా వర్కవుట్ కాదనే చాలామంది అన్నారు. కానీ లోకల్ కంటెంట్‌తోనే దాన్ని విజయవంతం చేశారు అరవింద్.

కొత్త కంటెంట్, అందులోనూ ఒరిజినల్ కంటెంట్ పెంచితే తప్ప ‘ఆహా’ను విజయవంతంగా కొనసాగించడం కష్టం. అందుకే కొత్త సినిమాలు కొంటున్నారు. అలాగే పెద్ద ఎత్తున వెబ్ సిరీస్‌ల నిర్మాణానికి కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. ఐతే సాధ్యమైనంత మేర బడ్జెట్లను నియంత్రించి తక్కువ ఖర్చుతో చేస్తే తప్ప అవి వర్కవుట్ కావని భావించిన అరవింద్.. ఆ దిశగానే స్టూడియో నిర్మాణం ప్రారంభించారని అంటున్నారు మల్టీపర్పస్‌గా ఉంటూ, ఎలా కావాలంటే అలా మార్చుకునే ఫ్లోర్లతోనే ఈ స్టూడియో ఏర్పాటు కానుందట.

భవిష్యత్తులో ‘ఆహా’ కోసం చేసే ఒరిజినల్స్ అన్నింటి చిత్రీకరణా చాలా వరకు ఇక్కడే కానిచ్చేస్తారట. బయటి స్టూడియోల్లో అద్దెలు భారీగా ఉన్న నేపథ్యంలో నిరంతరం సాగే వెబ్ సిరీస్‌ల షూటింగ్‌కు చాలా ఎక్కువ ఖర్చవుతుందని.. దాని బదులు స్టూడియో మీద పెట్టుబడి పెడితే ఒరిజినల్స్ అన్నీ ఇక్కడే చేసుకోవడంతో పాటు బయటి వాళ్లకు, తమ సినిమాలకు కూడా వాడుకోవచ్చని భావించి ఈ స్టూడియో నిర్మాణం చేపట్టినట్లు సమాచారం.

This post was last modified on October 2, 2020 11:36 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

1 hour ago

దమ్ముంటే నన్ను జైలుకు పంపు: జగన్ కు బీజేపీ మంత్రి సవాల్

మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…

2 hours ago

హీరోయిన్ సహనాన్ని మెచ్చుకోవాలి

సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…

2 hours ago

ఊరి కోసం పోరాడే రియల్ ‘ఛాంపియన్’

నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…

3 hours ago

తప్పు తెలుసుకున్న యువ హీరో

స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…

3 hours ago

వారిని కూడా జైల్లో వేస్తానంటున్న జగన్

ఏపీలో మెడికల్ కాలేజీల అంశంపై పెద్ద దుమారమే రేగుతోంది. కోటి సంతకాల పేరుతో రెండు నెలల పాటు వైసీపీ ఈ…

5 hours ago