నవంబర్ 14 విడుదల కాబోతున్న కంగువ ప్రమోషన్లలో భాగంగా హీరో సూర్య నిన్నబాలకృష్ణ అన్ స్టాపబుల్ సీజన్ 4 షోలో పాల్గొన్నాడు. ఆ తర్వాత ఎఎంబిలో జరిగిన ట్రైలర్ లాంచ్ లో అభిమానులను ప్రత్యక్షంగా కలుసుకున్నాడు. తనకు ఇక్కడ ఫాలోయింగ్ కొత్త కాకపోయినా గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేని నేపథ్యంలో ఎక్కువ రద్దీ ఉండకపోవచ్చని నిర్వాహకులు భావించారు. కానీ ఆ అంచనాలను తలకిందలు చేస్తూ ఒక్కసారిగా ఫ్యాన్స్ వందల సంఖ్యలో రావడంతో ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఉన్న సెక్యూరిటీ దీన్ని నియంత్రించలేక ఒక దశలో చేతులు ఎత్తేయాల్సిన పరిస్థితి వచ్చినా ఎలాగోలా కంట్రోల్ చేశారు.
నిజానికి ఇంత ప్రేమ సూర్య ఊహించాడో లేదో కానీ ఒక్కసారి ప్రేమించడం మొదలుపెడితే టాలీవుడ్ ఫ్యాన్స్ జీవితాంతం హీరోలను తమ గుండెల్లో పెట్టుకుంటారని చెప్పడానికి ఇంత కన్నా ఉదాహరణ అక్కర్లేదు. అందుకే సూర్య ఎమోషనల్ కాకుండా ఉండలేకపోయాడు. కన్నీళ్లు పెట్టుకున్నంత పని చేశాడు. సూర్య సన్ అఫ్ కృష్ణన్ రీ రిలీజ్ టైంలో థియేటర్లలో మీరు చేసిన సందడి చూసి కళ్ళు చెమర్చాయని, ఇంతగా ఇష్టపడే నేను తెలుగువాడిని కాదని చాలా మందికి తెలియకపోవడం గురించి సోషల్ మీడియా మీమ్ ని ఉదాహరణగా చెప్పి తన ప్రసంగం ద్వారా ఆకట్టుకున్నాడు.
ఇంకో ఇరవై రోజుల్లో రిలీజవుతున్న కంగువ మీద మంచి బజ్ ఉంది. సూర్య కెరీర్ లోనే కాదు కోలీవుడ్ లోనే అత్యధిక బడ్జెట్ పెట్టిన అతి కొద్ది సినిమాల్లో కంగువ ఉంటుందని నిర్మాత నమ్మకంగా చెబుతున్నాడు. అంతే కాదు ఈ కంటెంట్ కి రెండు వేల కోట్లు వసూళ్లు వచ్చినా ఆశ్చర్యం లేదని పలు సందర్భాల్లో ప్రకటించడం అంచనాలు మరింత పెంచుతోంది. అడవి జాతుల మధ్య జరిగే అంతర్యుద్ధాన్ని బ్యాక్ డ్రాప్ గా తీసుకున్న దర్శకుడు సిరుతై శివ వందల సంవత్సరాల క్రితం వెనక్కు తీసుకెళ్లబోతున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, బాబీ డియోల్ విలనీ, దిశా పటాని గ్లామర్ ఇలా ఎన్నో ఆకర్షణలు కంగువ నిండా ఉన్నాయి.
This post was last modified on October 25, 2024 10:26 am
టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…
ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…
ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…
టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…
పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…