ప్రభాస్ పుట్టిన రోజు వస్తోంది.. ఈసారి అప్‌డేట్స్‌తో మోత మోగిపోతుంది అంటూ తెగ హడావుడి జరిగింది సోషల్ మీడియాలో. ఓవైపు ప్రభాస్ పాత సినిమాల రీ రిలీజ్‌ల సందడి.. మరోవైపు కొత్త చిత్రాల కబుర్లతో అక్టోబరు 23న రెబల్ ఫ్యాన్స్ హంగామా మామూలుగా ఉండదంటూ కొన్ని రోజుల ముందు హంగామా నడిచింది. ప్రభాస్ నటిస్తున్న అన్ని సినిమాల నుంచి అప్‌డేట్స్ ఇవ్వడమే కాదు.. కొత్త ప్రాజెక్టులను కూడా ప్రకటిస్తారని వార్తలు వచ్చాయి. కానీ తీరా చూస్తే అభిమానులు కోరుకున్న అప్‌డేట్స్ ఏవీ రాలేదు.
‘రాజా సాబ్’ నుంచి మోషన్ పోస్టర్‌తో సరిపెట్టారు. నిజానికి అభిమానులు ఆశించింది ‘రాజా సాబ్’ టీజర్. టీం కూడా టీజర్ ట్రీట్ ఇవ్వబోతున్నట్లే సంకేతాలు ఇచ్చింది. తీరా చూస్తే మోషన్ పోస్టర్ మాత్రమే వదిలారు. అందులో ప్రభాస్ లుక్ ఆసక్తికరంగానే ఉంది కానీ.. ఇప్పటికే గ్లింప్స్ వదిలిన నేపథ్యంలో ఈసారి టీజర్ రిలీజ్ చేసి ఉంటే బాగుండేదనే ఫీలింగ్ కలిగింది.
ఇక ‘ఫౌజీ’ (వర్కింగ్ టైటిల్) సినిమా నుంచి ఏదైనా పోస్టర్ వస్తుందని ఆశించారు ఫ్యాన్స్. టైటిల్ కూడా అనౌన్స్ చేస్తారనుకున్నారు. కానీ ఈ రోజుకు ‘రాజా సాబ్’ ట్రీట్‌తో సరిపెట్టుకోండి, మన సినిమా గురించి ఇంకోసారి అప్‌డేట్ ఇస్తాం అంటూ ప్రభాస్-హను టీం ఉస్సూరుమనిపించింది. ఇక ‘స్పిరిట్’ నుంచి అప్‌డేట్ ఆశిస్తే.. గత ఏడాది రెడ్ కలర్‌లో హ్యాపీ బర్త్ డే ప్రభాస్ పోస్టర్ డిజైన్ చేసిన సందీప్ రెడ్డి ఈసారి వైట్ కలర్ బ్యాక్‌డ్రాప్‌లో అదే పోస్టర్‌ను మార్చి వదిలాడంటూ సోషల్ మీడియాలో కౌంటర్లు పడుతున్నాయి.
ప్రభాస్ నుంచి ‘సలార్-2’; ‘కల్కి-2’ సినిమాలు రావాల్సి ఉన్న నేపథ్యంలో వాటి నుంచి ఏమైనా అప్‌డేట్స్ ఉంటాయేమో అని ఆశిస్తే.. అటు నుంచి సౌండే లేదు. ఇక ప్రభాస్ నుంచి సర్ప్రైజ్ ప్రాజెక్టు గురించి అనౌన్స్‌మెంట్ ఉంటుందని జరిగిన ప్రచారమంతా ఉత్తిదే అని తేలిపోయింది. మొత్తంగా రెబల్ ఫ్యాన్స్‌ను ఈ బర్త్ డే చాల ా డిజప్పాయింట్ చేసిందనే చెప్పాలి. మరోవైపు ప్రభాస్ పాత సినిమాల రీ రిలీజ్ సందడి కూడా అనుకున్నంతగా లేకపోయింది.
This post was last modified on October 24, 2024 1:02 pm
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్‌లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…