అదేంటి ప్రభాస్ సినిమాకు సూర్య మూవీకి సంబంధం ఏమనుకుంటున్నారా. అక్కడే ఉంది అసలు మ్యాటర్. నవంబర్ 14 విడుదల కాబోతున్న కంగువ కోసం సూర్య ప్రమోషన్ టూర్ మొదలుపెట్టేశాడు. ముంబై నుంచి మొదలుపెట్టి ఉత్తరాది నగరాల్లో విస్తృతంగా తిరుగుతూ మీడియా, అభిమానులను కలుసుకుంటూ ఎడతెరిపి లేకుండా కెమెరా ముందుకు వస్తూనే ఉన్నాడు. దర్శకుడు సిరుతై శివ, హీరోయిన్ దిశా పటాని, విలన్ బాబీ డియోల్, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ లతో కలిసి తన సినిమాలో ఏమేం ఉన్నాయో, ఏ స్థాయిలో అలరిస్తాయో పూసగుచ్చినట్టు వివరించి చెబుతున్నాడు.
ఇక అసలు విషయానికి వస్తే కంగువని కోలీవుడ్ బాహుబలిగా తమిళనాడు బయ్యర్లు, సినీ లవర్స్ అభివర్ణించుకుంటున్నారు. ఆ స్థాయిలో ఇది కూడా రికార్డులు బద్దలు కొట్టి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెస్తుందని బోలెడు ఆశలు పెట్టుకున్నారు. దర్శకుడు శివ ఇప్పటిదాకా హ్యాండిల్ చేసినవన్నీ కమర్షియల్ సబ్జెక్టులే. చివరి చిత్రం రజనీకాంత్ పెద్దన్న దారుణంగా ఫ్లాప్ అయ్యింది. అయినా కథ మీద నమ్మకంతో జ్ఞానవేల్ రాజా వందల కోట్లు కుమ్మరించారు. ఆయన కాన్ఫిడెన్స్ ఏ స్థాయిలో ఉందంటే కంగువ 2తో పోటీ పడేందుకు భయపడే స్థాయిలో మొదటి భాగం ఉర్రూతలూగిస్తుందని అంటున్నారు.
ఇదంతా బాగానే ఉంది కానీ బాహుబలి పోలికతోనే వస్తుంది అసలు చిక్కు. గతంలో విజయ్ కూడా ఇలాగే అలోచించి పులిలో నటించాడు. శ్రీదేవి, కిచ్చ సుదీప్ లాంటి భారీ క్యాస్టింగ్ తో విఎఫెక్స్ కు ప్రాధాన్యం ఇస్తూ తెరకెక్కించారు. కట్ చేస్తే బొమ్మ దారుణంగా ఫెయిలయ్యింది. బాహుబలిని స్ఫూర్తిగా తీసుకుని సుందర్ సి కొన్నేళ్ల క్రితం సంఘమిత్ర అనే మల్టీస్టారర్ ప్రకటించారు. సెట్స్ పైకి వెళ్లకుండానే ఆగిపోయింది. ఇప్పుడు కంగువ ఈ నెగటివ్ సెంటిమెంట్స్ ని బ్రేక్ చేయాలి. కాకతాళీయంగా కంగువ, పులి రెండు సినిమాలకూ సంగీతం సమకూర్చింది దేవిశ్రీ ప్రసాదే కావడం గమనించాల్సిన విషయం.
This post was last modified on October 23, 2024 6:06 pm
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…