ఎక్కడ చూసినా పుష్ప 2 ది రూల్ కు సంబంధించిన వార్తలతో సినీ వ్యాపార వర్గాలు హోరెత్తిపోతున్నాయి. ఇంకా సరైన రీతిలో ప్రమోషన్ మొదలుకాకపోయినా అభిమానులు అంతకన్నా హై ఫీలవుతున్నారు. సుమారు 1100 కోట్ల దాకా థియేటర్, నాన్ థియేటర్ రెవిన్యూ చేయబోతోందన్న టాక్ వాళ్ళను కుదురుగా ఉండనివ్వడం లేదు. కేరళలో ఎన్నడూ లేనిది ఒక పరభాషా చిత్రం ఏకంగా 50 కోట్లు పలకడం గురించి మల్లువుడ్ వర్గాలు తీవ్రంగా చర్చించుకుంటున్నాయి. ఏరియాల వారీగా ఏకంగా రాజమౌళి నెంబర్లనే సవాల్ చేసే రీతిలో పుష్ప 2 కోసం డబ్బులు కుమ్మరించేందుకు డిస్ట్రిబ్యూటర్లు రెడీ అవుతున్నారు.
మా సైట్ కొద్దిరోజుల క్రితం అక్టోబర్ 10న చెప్పినట్టే పుష్ప 2 ఒకరోజు ముందు అంటే డిసెంబర్ 5నే రిలీజ్ కానుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రెస్ మీట్ రేపు జరగబోతోంది. ఇది కాకుండా వేరే షాకింగ్ న్యూస్ పెద్దగా ఉండకపోవచ్చు. ఇదిలా ఉండగా డిసెంబర్ 6ని లాక్ చేసుకున్న బాలీవుడ్ భారీ ప్యాన్ ఇండియా మూవీ చావా ఇప్పుడు పుష్పకు వస్తున్న క్రేజ్ చూసి చెమటలు తెచ్చుకుంటోందని నార్త్ బయ్యర్ల మాట. విక్కీ కౌశల్, రష్మిక మందన్న జంటగా నటించిన ఈ పీరియాడిక్ డ్రామా ప్రసిద్ధ మరాఠా వీరుడు, రాజు ఛత్రపతి శంభాజీ కథ ఆధారంగా భారీ బడ్జెట్ తో రూపొందుతోంది.
కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో చావాకు క్రేజ్ ఉన్నప్పటికీ పుష్ప 2 లాంటి కమర్షియల్ గ్రాండియర్ ని తట్టుకోగలమా అనే మీమాంసలో నిర్మాతలు ఉన్నట్టు సమాచారం. పోస్ట్ పోన్ గురించి ఇంకా చెప్పలేదు కానీ ఒకవేళ జరిగినా ఆశ్చర్యం లేదని అక్కడి వర్గాలు అంటున్నాయి. నిజానికి ఆగస్ట్ లోనే పుష్ప 2 వస్తుందని చెప్పినప్పుడు అదే డేట్ కి రావాలనుకున్న సింగం అగైన్ మరో ఆలోచన లేకుండా వాయిదా వేసుకుంది. ఇప్పుడు చావాకు అదే పరిస్థితి వచ్చినా ఆశ్చర్యం లేదు. పెద్ద ఎత్తున బిజినెస్ జరిగింది కనక సోలో రిలీజ్ అయితే రికవరీ వేగంగా ఉంటుందని డిస్ట్రిబ్యూటర్లు భావిస్తున్నారు. చూడాలి మరి.
This post was last modified on October 23, 2024 5:41 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…