ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సంపధలోనే కాదు, మంచితనంలోను మహారాజే. బాహుబలి సినిమా కంటే ముందే అతని భవిష్యత్తుని చాలామంది ఊహించారు. ఆ కటౌట్ కు ఏదో ఒక రోజు ఇండియా మొత్తం థ్రిల్ అవుతుందని అన్నారు. అయితే ఇండస్ట్రీలోకి రాక మునుపు ప్రభాస్ కు కూడా అప్పుడప్పుడు కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా ఎదురయ్యాయి. అతనితో క్లోజ్ గా ఉండేవాళ్ళు కొందరు ప్రభాస్ బద్ధకాన్ని చూసి ఎలా బ్రతుకుతాడో ఏంటో అనేవారు.
కానీ వర్క్ విషయంలోకి వచ్చేసరికి గొడ్డులా పని చేస్తాడని రాజమౌళి సైతం బాహుబలి టైమ్ లో క్లారిటీ ఇచ్చాడు. నేడు ప్రభాస్ పుట్టినరోజు కావడంతో అతనికి సంబంధించిన అనేక రకాల విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఒక సందర్భంలో ప్రభాస్ తన స్నేహితుడు చేసిన కామెంట్స్ గురించి కూడా నవ్వుతూ చెప్పాడు. “ఓ రోజు హీరో అవుతానని చెప్పినప్పుడు నా స్నేహితుడు ‘నువ్వు హీరో ఏంట్రా బాబూ’ అంటూ నవ్వాడు. కుటుంబ సభ్యులు కూడా మొదట షాక్ అయ్యారు కానీ, చివరకు నటనలో శిక్షణ కోసం సత్యానంద్ గారి దగ్గరకు పంపించారు” అని అన్నారు.
మూడు నెలల ట్రైనింగ్ తర్వాత, ఫైట్స్, డ్యాన్స్‌లలో శిక్షణ తీసుకోవాలని భావించినా సాధ్యపడలేదు. ఇక ఒకరోజు నిర్మాత అశోక్ కుమార్, హీరోగా పరిచయం చేయాలని నిర్ణయించి, ప్రభాస్ తండ్రి సూర్యనారాయణ రాజు, పెద్దనాన్న కృష్ణం రాజు గారిని కలిశారు. కథ నచ్చడంతో వారు అంగీకరించారు, కానీ ప్రభాస్ కొంత టెన్షన్‌గా ఫీల్ అయ్యాడు. “ఇది మంచి అవకాశం, యాక్షన్‌తో కూడిన లవ్ స్టోరీ చేయటం కెరీర్‌కు ప్లస్ అవుతుంది” అని పెద్దవాళ్లు నచ్చజెప్పారు. అలా, 2002లో నవంబరు 11న విడుదలైన ‘ఈశ్వర్’ సినిమాతో ప్రభాస్ తన టాలీవుడ్ ప్రయాణాన్ని ప్రారంభించారు.
This post was last modified on October 23, 2024 11:25 am
ఇండియన్ క్రికెట్లో మీడియా దృష్టిని బాగా ఆకర్షించిన జంటల్లో ఒకటనదగ్గ యుజ్వేంద్ర చాహల్-ధనశ్రీ విడిపోవడం ఇటీవల చర్చనీయాంశం అయిన సంగతి…
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ తో టీడీపీ అధినేత, ఏపీ సీఎం…
గత ఏడాది మలయాళం బ్లాక్ బస్టర్ ప్రేమలు తెలుగులోనూ మంచి విజయం నమోదు చేసుకుంది. ఎస్ఎస్ కార్తికేయ తీసుకున్న ప్రత్యేక…
అంతరిక్షం నుంచి భూమికి తిరిగొచ్చిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ త్వరలోనే భారత్‌కు రానున్నారని సమాచారం. తొమ్మిది నెలల…
ఐపీఎల్ 2025 సీజన్లో అందరి దృష్టి ఒక చిన్న కుర్రాడిపై నిలిచింది. కేవలం 13 ఏళ్ల వయసులో ఐపీఎల్లో అడుగుపెడుతున్న…
సినిమాలు తగ్గించినా సరే దేవిశ్రీ ప్రసాద్ సంగీతానికి ఉన్న ఫాలోయింగ్ చాలా ప్రత్యేకం. డిసెంబర్లో పుష్ప 2 ది రూల్…