విజయ్ దేవరకొండ లైగర్ సినిమాకు తీసుకున్న జాగ్రత్తలు అన్ని ఇన్ని కావు. అంతకుముందు వరకు అలాంటి కమర్షియల్ జానర్ లో సినిమాలు చేయలేదు. అర్జున్ రెడ్డిలో మాస్ యాంగిల్ కాస్త టచ్ చేసినా యాక్షన్ అంశాలు లేవు. కాబట్టి లైగర్ టైమ్ లో ప్రత్యేకంగా యాక్షన్ సీక్వెన్స్ కోసం శిక్షణ తీసుకున్నాడు. జిమ్ లో చెమటోడ్చి బాడీ కూడా పెంచాడు.
కానీ పూరి మేకింగ్ విధానం పూర్ గా ఉండడంతో అతని కష్టమంతా వృధా అయిపోయింది. ఆ సినిమా ఫలితం తేడా కొట్టినా విజయ్ కు మాత్రం అదొక పాఠంలా ఉపయోగపడింది. ఇక ఇప్పుడు VD12 కోసం అదే రేంజ్ లో కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది.
ఇది గౌతమ్ తీస్తున్న KGF లాంటి సినిమా అంటూ నాగవంశీ కూడా సాలీడ్ ఎలివేషన్ ఇచ్చాడు. దీంతో సినిమాలో యాక్షన్ అంశాలు గట్టిగా ఉండనున్నట్లు అర్ధమవుతుంది. టీమ్ ప్రస్తుతం మున్నార్‌లో షూటింగ్ జరుపుకుంటుంది. స్టంట్ డైరెక్టర్ చేతన్ రామ్షి డిసౌజా ఆధ్వర్యంలో ఇంటర్వెల్ ఫైట్ సీక్వెన్స్‌ని పూర్తి చేసారు. అందులో విజయ్ ఫైట్స్ ఊచకోత తరహాలో ఉంటాయట.
జెర్సీ సినిమాతో మర్చిపోలేని ఎమోషనల్ టచ్ ఇచ్చిన దర్శకుడు గౌతమ్ ఈ సినిమాలో కూడా అదే విధంగా గుండెల్ని పిండేసే సీన్స్ హైలెట్ చేశారట. ఇక అలాంటి దర్శకుల నుంచి యాక్షన్ సీన్స్ వస్తే మామూలుగా ఉండవు. విజయ్ లుక్ పరంగా కూడా ఇందులో విభిన్నంగా కనిపిస్తాడని తెలుస్తోంది. ఇక లైగర్ కోసం నేర్చుకున్న యాక్షన్ పాఠాలు విజయ్ ఇక్కడ పర్ఫెక్ట్ గా వచ్చేలా కష్టపడుతున్నాడు. అతని కష్టానికి VD12 ద్వారా ఫలితం దక్కే అవకాశం ఉంది. మరి సినిమా కంటెంట్ జనాలకు ఎంతవరకు కనెక్ట్ అవుతుందో చూడాలి.
This post was last modified on October 21, 2024 11:09 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…