Movie News

దేవుడి పాత్రలో సూర్య ప్రయోగం

వచ్చే నెల నవంబర్ 14న కంగువగా రాబోతున్న సూర్య దాని ప్రమోషన్ల కోసం నార్త్ మొత్తం చుట్టేస్తున్నాడు. తమిళనాడుతో పాటు ఏపీ తెలంగాణకు సంబంధించిన కార్యక్రమాలు చివరి పది రోజుల్లో ఉదృతం చేయబోతున్నారు. చెన్నైలో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత హైదరాబాద్ లోనూ అంతటి ఘనమైన వేడుక చేసే ప్లాన్ లో ఉంది చిత్ర బృందం. దీనికన్నా చాలా ఆలస్యంగా మొదలైన దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు సినిమా వేగంగా షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత కమెడియన్ కం డైరెక్టర్ ఆర్జె బాలాజీకు అధికారికంగా సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

దీనికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన లీకులు చూద్దాం. కరుప్పు టైటిల్ పరిశీలనలో ఈ ఫాంటసీ డ్రామాలో సూర్య దేవుడి తరహా వేషం వేయబోతున్నట్టు తెలిసింది. అంటే గోపాల గోపాలలో పవన్ కళ్యాణ్ టైపు అన్నమాట. నిజానికి ఆర్జె బాలాజీ నయనతారతో మూకుతి అమ్మన్ (అమ్మోరు తల్లి) తీశాక దానికి కొనసాగింపుగా ఇంకో భాగం రాసుకున్నాడు. కానీ నిర్మాత, హీరోయిన్ తో ఏదో పొసగకపోవడంతో దాన్ని మగ పాత్రగా మార్చుకుని దేవుడిగా చేశాడట. అది సూర్యకు విపరీతంగా నచ్చడంతో తెరకెక్కుతోందని చెన్నై టాక్. గతంలో చూడని కొత్త ట్రీట్ మెంట్ ఇందులో ఉంటుందని అంటున్నారు.

స్టార్ హీరోలను డీల్ చేసిన అనుభవం లేని ఆర్జె బాలాజీకి అవకాశం ఇవ్వడం పట్ల అభిమానుల్లో అనుమానాలు ఉన్నా సూర్య మాత్రం కంటెంట్ ని బలంగా నమ్మేశాడు. దానికి తగ్గట్టే స్క్రిప్ట్ బాగా వచ్చిందట. కంగువ రిలీజైన తర్వాత కొంచెం బ్రేక్ తీసుకుని దీని రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు. ఇంకోవైపు కంగువ పార్ట్ 2కి కూడా రంగం సిద్ధం చేస్తున్నారు. వెట్రిమారన్ తో తొలుత ప్లాన్ చేసుకున్న వడివాసల్ గురించి ఎలాంటి అప్డేట్స్ లేవు. దర్శకుడు హీరో ఇద్దరూ ఏ సందర్భంలో టాపిక్ వచ్చినా త్వరలో అంటున్నారు తప్పించి మొదలుపెట్టే దిశగా చర్యలు తీసుకోవడం లేదు. సుధా కొంగర ప్రాజెక్టు కూడా సూర్య డ్రాప్ అయ్యారు.

This post was last modified on October 21, 2024 5:58 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అదానీ-జగన్ లింకుపై చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్

సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…

3 hours ago

ఈవన్నీ చేస్తే AP టూరిజంకు తిరుగుండదు

జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…

5 hours ago

రేవంత్ రెడ్డి.. అదానీ ఒప్పందాలు రద్దు చేస్తారా?

అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…

5 hours ago

మంచు విష్ణు అసలు ప్లానింగ్ ఇదా

మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…

6 hours ago

సాక్షి మీడియా నన్ను కవర్ చేయదు…షర్మిల సెటైర్లు

మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…

7 hours ago