తలా అజిత్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ రూపొందిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ షూటింగ్ ప్లానింగ్ ప్రకారమే జరుగుతోంది కానీ సంక్రాంతి విడుదల విషయంలో ఏర్పడ్డ సందిగ్దత అభిమానులను అయోమయంలో పడేస్తోంది. ఎందుకంటే అజిత్ మరో సినిమా విదాముయార్చి ఇంకా రిలీజ్ కాలేదు. దసరా అన్నారు. కుదరలేదు. దీపావళి అనుకున్నారు. పనవ్వలేదు. పోనీ నవంబర్ లో చూద్దామా అంటే సూర్య కంగువ లాక్ చేసుకుని తెలివైన పని చేసింది. మిగిలింది డిసెంబర్. కానీ వరస డిజాస్టర్లతో కుదేలైన లైకా సంస్థ డిస్ట్రిబ్యూటర్ల నుంచి వస్తున్న ఒత్తిడి కారణంగా జనవరి పొంగల్ బరిలో దించాలని చూస్తోందట.
ఒకవేళ అదే జరిగితే గుడ్ బ్యాడ్ అగ్లీని వాయిదా వేయాల్సి ఉంటుంది. మైత్రి నిర్మాతలు ప్రస్తుతం అజిత్ మాట కోసం ఎదురు చూస్తున్నారని చెన్నై టాక్. సంక్రాంతి లాంటి మంచి సీజన్ తెలుగులోనే కాదు తమిళంలోనూ విపరీతమైన వసూళ్లు తీసుకొస్తుంది. అజిత్, విజయ్ చాలాసార్లు ఈ పండగను వాడుకుని రికార్డులు సృష్టించారు. పైగా ఇప్పటిదాకా వేరే కోలీవుడ్ సినిమాలేవీ అధికారికంగా డేట్లు ప్రకటించలేదు. విక్రమ్ వీర ధీర శూరన్ లాంటి పేర్లు వినిపిస్తున్నాయి కానీ ఇంకా అఫీషియల్ కాలేదు. సో తేదీ కనక కుదిరితే కనకవర్షం ఖాయమని మైత్రి బృందం నమ్మకం. కానీ మ్యాటర్ ఇంకా తేలలేదు.
ఇటుపక్క టాలీవుడ్ లో ఏర్పడ్డ విపరీతమైన పోటీ డబ్బింగ్ సినిమాలకు ఏ మాత్రం స్పేస్ ఇస్తుందనేది అనుమానంగానే ఉంది. అయితే గతంలో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి మధ్య వారసుడిని దింపి సేఫ్ చేయించుకున్న దిల్ రాజు తరహాలో గుడ్ బ్యాడ్ అగ్లీకి ఏమైనా స్ట్రాటజీ ప్లాన్ చేస్తారేమో చూడాలి. విశాల్ మార్క్ ఆంటోనీతో తమిళంలో బ్లాక్ బస్టర్ అందుకున్న ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ కమర్షియల్ డ్రామాలో అజిత్ డిఫరెంట్ షేడ్స్ పోషించారని టాక్ ఉంది. ఏది ముందు ఏది వెనక్కు ఇంకా తేలని కారణంగానే ప్రమోషన్లు మొదలుపెట్టలేకపోతున్నారు. అజితే ఫైనల్ చేయాలి.
This post was last modified on October 21, 2024 1:53 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…