Movie News

ఫ్లాపయిన గాయం కన్నా వివాదాల బాధే ఎక్కువ

స్త్రీ 2 స్థాయిలో బ్లాక్ బస్టర్ అవుతుందని ఎంతో నమ్మకం పెట్టుకున్న జిగ్రా చివరికి అత్తెసరు వసూళ్లతో సరిపెట్టుకుని బాక్సాఫీస్ ఫైనల్ రన్ కు దగ్గరలో ఉంది. నార్త్ లో ఓ మోస్తరు కలెక్షన్లు వస్తున్నప్పటికీ హిట్ అని చెప్పుకునేందుకు అవి సరిపోవడం లేదు.

బోలెడు ఆశలతో తెలుగుతో సహా సౌత్ భాషల్లో డబ్బింగ్ చేస్తే కనీసం ఈవెంట్ ఖర్చులు రాలేదు. సమంతా, త్రివిక్రమ్, రానాలు అలియా భట్ కోసం అండగా నిలబడి ప్రమోషన్లో భాగమైనా లాభం లేకపోయింది. సరే ఏ ఆర్టిస్టుకైనా ఫ్లాపులు సహజం కానీ జిగ్రాకు మాత్రం కొన్ని వివాదాలు, గాయాలు కొంత కాలం వెంటాడేలా ఉన్నాయి.

మొదటిది కొన్ని నెలల క్రితం వచ్చిన ‘సవి’ని కాపీ కొట్టారనే కాంట్రావర్సి వాటిలో మొదటిది. కలెక్షన్ల పరంగా కూడా మాన్యుపిలేట్ చేశారనే విమర్శలు బలంగా ఉన్నాయి. జనం లేకపోయినా థియేటర్లను బ్లాక్ చేసి ట్రేడ్ తో నెంబర్లు చెప్పించారనే వార్తలు గట్టిగా తిరిగాయి.

నిర్మాత కరణ్ జోహార్ వాటిని ఖండించారు. దానికి తోడు సోషల్ మీడియాలో వచ్చిన నెగటివిటీని తట్టుకోలేక దర్శకుడు వాసన్ బాలా ఏకంగా తన ట్విట్టర్ అకౌంట్ ని తాత్కాలికంగా డిలీట్ చేసుకున్నారు. ఇన్స్ టాలో యాక్టివ్ గా ఉన్నప్పటికీ ఎక్స్ ప్లాట్ ఫార్మ్ లో ఫ్యాన్స్ నుంచి ఏ రేంజులో తిట్ల దండకం వచ్చి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

ఇదంతా ఎలా ఉన్నా అలియా భట్ కు జిగ్రా ఫలితం తీవ్రంగా నిరాశ పరిచింది. శ్రద్ధా కపూర్ లాగా సోలో బ్లాక్ బస్టర్ అందుకుందామంటే ఆ కోరిక నెరవేరలేదు. అయినా తన మార్కెట్, అవకాశాలకు వచ్చిన ఇబ్బందేమీ లేదు. యష్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తున్న లేడీ స్పై థ్రిల్లర్ అల్ఫాలో టైటిల్ రోల్ పోషిస్తోంది. బ్రహ్మాస్త్ర పార్ట్ 2లో కొనసాగనుంది. ఈ రెండు మళ్ళీ పెద్ద బ్రేక్ ఇస్తాయని నమ్మకంగా ఉంది.

అయినా దెయ్యాల ట్రెండ్ నడుస్తున్న బాలీవుడ్ లో ఇప్పుడు రొటీన్ యాక్షన్ రివెంజ్ డ్రామాలతో పనవ్వదు. జవాన్, పఠాన్ లాగా పవర్ ఫుల్ గా ఉంటే తప్ప ఆషామాషీ జిగ్రాలకు భంగపాటు తప్పడం లేదు.

This post was last modified on October 20, 2024 6:43 pm

Share

Recent Posts

వంగా, జక్కన్న ఫెయిల్… నీల్ అయినా నిలబెడతాడా!

స్టార్ డైరెక్టర్ సినిమాను డైరెక్ట్ చేయకపోయినా.. కనీసం సమర్పకుడిగా ఆయన పేరు పోస్టర్ మీద పడితే చాలు, ఆ ప్రాజెక్టుకు…

16 minutes ago

నాని నిర్ణయం రిస్క్ అవుతుందా

ప్యారడైజ్ ఫలితం తర్వాత నాని కొంచెం డిఫెన్స్ లో పడిన మాట వాస్తవం. పదే పదే మాస్ ని లక్ష్యంగా…

1 hour ago

అదుర్స్ కొనసాగింపు కుదరదని తెలిసినా

కొన్ని సినిమాలకు కొనసాగింపులు సులభం కాదు. ఏదో జనాల్లో క్రేజ్ ఉంది కదాని, సోషల్ మీడియాలో హైప్ ఉంది లెమ్మని…

2 hours ago

సెన్సార్ బోర్డుపై కుండబద్దలు కొట్టిన కోన

సినిమాల సెన్సార్షిప్‌ విషయంలో పెద్ద పెద్ద సినిమాలకు కూడా ఈ మధ్య తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో…

3 hours ago

మోదీ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం

వందేళ్ల క్రితం సైమన్ ను రక్షించడానికి ప్రయత్నించిన బ్రిటీష్ ప్రభుత్వం కుప్పకూలిపోయిందని, ఇప్పుడు జ్ఞానేష్ కుమార్ ను రక్షించాలని ప్రయత్నం…

4 hours ago

మత రాజకీయమే మార్గమా సాయిరెడ్డి?

వైసీపీ మాజీ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి సగటు రాజకీయ నాయకుడి నుంచి మతపరమైన రాజకీయాలు చేసి…

5 hours ago