సినిమాలు చేయడంలో మంచి వేగం చూపిస్తున్న విశ్వక్ సేన్ అంతే స్థాయిలో వరస విజయాలు అందుకోలేకపోతున్నాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న మాస్ కా దాస్, బాగా ప్రమోట్ చేసుకున్న గ్యాంగ్స్ అఫ్ గోదావరి అభిమానులను నిరాశపరిచాయి. గామికి ప్రశంసలు దక్కి బ్రేక్ ఈవెన్ అయ్యింది కానీ రిపీట్ వేల్యూ ఉన్న మూవీగా నిలవలేదు.
తాజాగా వచ్చే నెల నవంబర్ 22 మెకానిక్ రాకీగా రాబోతున్నాడు. రవితేజ్ ఎం దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ డ్రామాలో రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ పాయింట్ ఉన్న వైవిధ్యం ప్రేక్షకులకు కొత్త అనుభూతి నిస్తుందనే నమ్మకం విశ్వక్ వ్యక్తం చేస్తున్నాడు.
ఇవాళ ట్రైలర్ లాంచ్ జరిగింది. కాన్సెప్ట్ ఏంటో చెప్పేశారు. కంప్యూటర్ ఇంజనీరింగ్ తప్పిన కుర్రాడు(విశ్వక్) తండ్రి (నరేష్) నడిపే మెకానిక్ షెడ్ బాధ్యతలు తీసుకుంటాడు. నచ్చిన అమ్మాయి వెంట పడే హాబీ ఉన్న ఇతని జీవితంలోకి ఇద్దరు ముద్దుగుమ్మలు వస్తారు. కట్ చేస్తే ఒక విలన్ (సునీల్) వల్ల వీళ్ళ వ్యాపారానికి గండి పడటమే కాదు కుటుంబం ప్రమాదంలో పడుతుంది. దీనికి రాకీ ఏం చేశాడనేది అసలు స్టోరీ.
ఈవెంట్ లో మాట్లాడిన విశ్వక్ సేన్ నవంబర్ 21 ప్రీమియర్లు వేస్తామని ఒకవేళ నచ్చలేదని ఎవరైనా చెబితే రిలీజ్ రోజు థియేటర్లకు రావొద్దని చెప్పాడు. ఈ టైపు ఛాలెంజులు గతంలోనూ చేశాడు విశ్వక్.
సరిపోదా శనివారం తర్వాత సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్ కి మెకానిక్ రాకీ అంతకు మించి బ్రేక్ ఇస్తుందని అన్నాడు. బజ్ లేదని ఇప్పటిదాకా చాలా మంది అన్నారని, అసలు తామే బజ్ తేలేదని, ఇప్పటి నుంచి మారుతుందని అన్నాడు.
మొత్తానికి బోలెడు కబుర్లతో అభిమానులను ఖుష్ చేసిన విశ్వక్ బృందం నెల రోజుల ముందే ట్రైలర్ ని అందులోనూ ఫస్ట్ వెర్షన్ ని విడుదల చేయడం గమనార్షం. మీనాక్షి చౌదరి, శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో సునీల్ మెయిన్ విలన్ గా నటిస్తున్నాడు. ఆటోమొబైల్స్ కు సంబంధించిన క్రైమ్ ఎలిమెంట్ ఇందులో కీలకంగా ఉంటుందని టాక్.
This post was last modified on October 20, 2024 6:41 pm
ఇప్పుడంతా ఇంటర్ నెట్ ప్రపంచం. కొన్ని నిముషాలు మొబైల్ డేటా లేకపోయినా, ఇంట్లో వైఫై పనిచేయకపోయినా ఏదో భూమి బద్దలైపోయి…
ఈ సోషల్ మీడియా కాలంలో పెద్ద పెద్ద సినిమాలకు సంబంధించి కూడా ఆన్ లొకేషన్ ఫొటోలు, వీడియోలు లీక్ అయిపోతుంటాయి.…
ముందో విడుదల తేదీ అనుకుని పోటీ వల్ల వెనుకడుగు వేసి ఇప్పుడు కొత్త డేట్ పట్టుకునేందుకు కిందా మీద పడుతున్న…
https://youtu.be/zHiKFSBO_JE?si=HDSpx4GNEhcOje0y కొత్త సంవత్సరం తొలి ప్యాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ జనవరి 10 విడుదల కాబోతున్న నేపథ్యంలో అందరి…
టీమిండియా స్టార్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌తో పాటు యువ క్రికెటర్లు సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, మోహిత్ శర్మలు ఓ…