టాలీవుడ్ హీరోయిన్ గా గుర్తింపు రావడం ఒక ఎత్తయితే వరస అవకాశాలు దక్కించుకోవడం అసలు ఛాలెంజ్. కాకపోతే కెరీర్ ఎలా ఉండబోతోందనేది సక్సెస్ రేట్ మీద ఆధారపడి ఉంటుంది. మీనాక్షి చౌదరి ప్రస్తుతం అలాంటి దశ కోసం ఎదురు చూస్తోంది.
మాములుగా స్టార్ హీరోల సరసన ఛాన్స్ వచ్చినప్పుడు ఇంకేం సెటిలైపోయినట్టే అనిపిస్తుంది. కానీ తన విషయంలో మాత్రం రివర్సయ్యింది. గుంటూరు కారంలో మహేష్ బాబుతో ఆనందం కొంతైనా మిగల్లేదు. మెయిన్ లీడ్ శ్రీలీల కావడంతో పాటు మీనాక్షి పాత్రను మరీ తీసికట్టుగా డిజైన్ చేయడం ఏ మాత్రం ఉపయోగపడలేదు.
ఇక విజయ్ తో ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైంలో ఆఫర్ వచ్చినప్పుడు అందరూ జాక్ పాట్ అనుకున్నారు. తీరా చూస్తే డ్యూయల్ రోల్ చేసిన ఇద్దరు విజయ్ లలో నెగటివ్ పాత్రకు జోడిగా పెట్టడమే కాక ఏకంగా సెకండాఫ్ లో తన క్యారెక్టర్ ని చంపేయడం పెద్ద మైనస్ అయ్యింది.
ఇప్పుడు లక్కీ భాస్కర్ లో దుల్కర్ సల్మాన్ భార్యగా అక్టోబర్ 31 మరోసారి కనిపించనుంది. దర్శకుడు వెంకీ అట్లూరి ధనుష్ సార్ లో సంయుక్త మీనన్ ని అందంగా చూపించడమే కాక మంచి బ్రేక్ దక్కేలా చేశాడు. మరి మీనాక్షి చౌదరిని కూడా అదే తరహాలో ప్రెజెంట్ చేసి ఉంటే పనవ్వుద్ది. లేదంటే మళ్ళీ వెయిటింగ్ కొనసాగించాల్సి ఉంటుంది.
చిన్నా పెద్ద ఇప్పటిదాకా మీనాక్షి చౌదరి చేసిన సినిమాలను చూస్తే లక్కీ భాస్కర్ లో కాస్త ఎక్కువ ప్రాధాన్యం దక్కినట్టు కనిపిస్తోంది. పెర్ఫార్మన్స్ కు స్కోప్ ఇచ్చి ఉంటే మాత్రం స్టార్ డైరెక్టర్ల కళ్ళలో పడొచ్చు. దీని తర్వాత ఈ హర్యానా బ్యూటీ నటించిన విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ, వరుణ్ తేజ్ మట్కాలు తక్కువ గ్యాప్ లో రాబోతున్నాయి.
ఇప్పుడీ దుల్కర్ సల్మాన్ మూవీ కనక హిట్ అయితే ఒక బలమైన పునాది పడినట్టు అవుతుంది. విశ్వంభరలోనూ చేసిందనే టాక్ ఉంది కానీ యూనిట్ అధికారికంగా ప్రకటించలేదు. ఇవి కాకుండా ఒప్పుకున్నవి ప్రస్తుతానికి లేవు. ఏ బ్రేక్ దక్కినా అది 2024లోనేజరిగిపోవాలి . చూద్దాం.
This post was last modified on October 19, 2024 5:36 pm
బిజీ హీరోయిన్ల డేట్లను షెడ్యూల్స్ తగట్టు తెచ్చుకోవడం దర్శక నిర్మాతలకు ఒక్కోసారి పెద్ద సవాల్ గా మారుతుంది. అంత డిమాండ్…
2007 లో విడుదలైన హ్యాపీ డేస్ మూవీతో కుర్ర కారులో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న మిల్కీ బ్యూటీ తమన్న. అగ్ర…
దేశవ్యాప్తంగా హిందీ భాషను రుద్దాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. తమిళనాట…
ఇళయరాజా పేరు ఈ మధ్య కాలంలో తరచుగా వివాదాలతోనే వార్తల్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. వయసు మీద పడడంతో ఆయన…
ఆస్కార్ అవార్డుల్లో ఆధిపత్యం చలాయించే అన్ని సినిమాలకూ వసూళ్లు వస్తాయని గ్యారెంటీ లేదు. అలాగే వసూళ్ల మోత మోగించిన చిత్రాలకూ…
వైసీపీ హయాంలో రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ అమ్మకం, వాడకం విచ్చలవిడిగా పెరిగిపోయాయని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. దేశంలో ఏ…