టాక్ షోలలో కొత్త ట్రెండ్ సృష్టించిన అన్ స్టాపబుల్ సీజన్ 4 కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో అమాంతం అద్భుతాలు చేస్తామనే స్థాయిలో విజువల్స్ చూపించలేదు కానీ బాలయ్య మాత్రం డబుల్ ఎనర్జీతో నడిపిస్తాననే హామీ ప్రేక్షకుల్లో హైప్ పెంచింది. ఇదిలా ఉండగా ఈ నాలుగో సిరీస్ మొదటి ఎపిసోడ్ ని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో షూట్ చేయబోతున్నట్టు లేటెస్ట్ అప్డేట్. ఇద్దరి మధ్య బంధుత్వంతో పాటు సిఎం, ఎమ్మెల్యే అనే బాండింగ్ ఉండటంతో అంచనాలు ఎక్కువగా ఉంటాయి.
కాకపోతే గత సీజన్ లోనే బాలయ్య అండ్ బాబు కాంబోని ఆడియన్స్ చూసేశారు కాబట్టి ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఏం చెప్పిస్తారనే సందేహం రావడం సహజం. అప్పుడు ప్రతిపక్షం, ఇప్పుడు సగర్వ అధికార పక్షం అనే పాయింట్ సరిపోదు. ఎందుకంటే అన్ స్టాపబుల్ 4 చూసేవాళ్ళలో రాజకీయాలంటే ఆసక్తి ఉన్న వాళ్ళతో పాటు సినిమా బ్యాచ్ ఎక్కువగా ఉంటారు. అందుకే గత బాబు ఎపిసోడ్ కోట్లాది వ్యూస్ తో సూపర్ హిట్ అయ్యింది. ఎమోషనల్ విషయాలు, 90 దశకంలో టిడిపి అధికార మార్పిడి నాటి పరిణామాలు, గెలుపోటముల ముచ్చట్లు, రెండు కుటుంబాల మధ్య అనుబంధాలు ఇలా ఎన్నో పంచుకున్నారు.
ఇప్పుడు కొత్తగా వియ్యంకులు ఏం షేర్ చేసుకుంటారనేది చూడాలి. రెండోసారి అంటే అంత ఆసక్తి ఉండదనే కామెంట్స్ వినిపిస్తున్నప్పటికీ అలా అనిపించకుండా ఎపిసోడ్ డిజైన్ చేశారనే మాట యూనిట్ నుంచి వినిపిస్తోంది. బాబు జైలు జీవితం, ఇరు ఫ్యామిలీలు అనుభవించిన మానసిక క్షోభ, లోకేష్ విజయం, జనసేన పాత్ర, పవన్ కళ్యాణ్ చొరవ ఇలా ఎన్నో కొత్త అంశాలు చర్చలోకి వస్తాయని అంటున్నారు. ఈ ఎపిసోడ్ లోనే పవన్ కళ్యాణ్ కూడా రావొచ్చని లీక్ వచ్చింది కానీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ తప్పించి ఖరారుగా చెప్పలేదు. నిజం కాకపోయినా ఓకే కానీ బాబుతో బాలయ్య ఎలాంటి సంచలన విషయాలు రాబడతారో చూడాలి.
This post was last modified on October 19, 2024 1:06 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…