టాలీవుడ్లో ఒకప్పుడు ఫుల్ బిజీగా ఉన్న సమంత.. ఇప్పుడు అవకాశాలే లేని స్థితికి చేరుకుంది. ఇందుకు ప్రధాన కారణం ఆమె అనారోగ్యం. నాగచైతన్య నుంచి విడాకులు తీసుకుని మానసికంగా కాస్త కుంగుబాటులో ఉన్న సమయంలో ఆమెకు మయోసైటిస్ అనే ప్రమాదకర జబ్బు సోకింది. దానికి చికిత్స తీసుకోవడం కోసం చాన్నాళ్ల సమయం వెచ్చించింది సామ్. ఇండియాలోనే కాక యుఎస్‌లోనూ ఆమె చికిత్స సాగింది. ఇందుకోసం కెరీర్లోనూ గ్యాప్ తీసుకోక తప్పలేదు.
అనారోగ్యం నుంచి కోలుకున్నాక ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. ఈ కారణంతోనే తాను ‘సిటాడెల్’ వెబ్ సిరీస్‌కు కూడా దూరం కావాల్సిందని.. కానీ రాజ్-డీకే తన కోసమే పట్టుబట్టి ఎదురు చూడడం వల్లే ఈ సిరీస్ చేయగలిగానని అంటోంది సామ్. ఈ సిరీస్‌లో పాత్రకు తనను అడిగినపుడు తాను చేయనని చెప్పినట్లు ఆమె వెల్లడించింది.
“సిటాడెల్ కథ నా దగ్గరికి వచ్చినపుడే నాకు మయోసైటిస్ కన్ఫమ్ అయింది. దీంతో బన్నీ పాత్రలో నేను నటించలేనని దర్శకులు రాజ్-డీకేలకు చెప్పేశా. ఈ పాత్ర కోసం ఎవరు బాగుంటారో నలుగురు హీరోయిన్ల పేర్లు కూడా చెప్పాను. కానీ నా సూచనలను వాళ్లు తిరస్కరించారు. నాతోనే ఈ సిరీస్ చేయాలని నా ఆరోగ్యం కుదుటపడే వరకు ఎదురు చూశారు. కానీ ఇప్పుడీ సిరీస్ చూస్తుంటే ఆ సమయంలో డైరెక్టర్లు తీసుకున్న నిర్ణయానికి థ్యాంక్స్ చెప్పాలనిపిస్తోంది. ఎందుకంటే నేనే చెప్పినా సరే వేరే వాళ్లను తీసుకోకుండా నాతోనే ఈ పాత్ర చేయించడం నా అదృష్టంగా భావిస్తున్నా” అని సమంత చెప్పింది.
హాలీవుడ్లో రుసో బ్రదర్స్ రూపొందించిన ‘సిటాడెల్’కు లోకల్ అడాప్షన్‌గా తెరకెక్కిన ఈ సిరీస్ నవంబరు 7న అమేజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ కాబోతోంది. ఇందులో సామ్‌కు జోడీగా బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ నటించాడు. ఇందులో వరుణ్, సామ్ సీక్రెట్ ఏజెంట్లుగా నటించారు.
This post was last modified on October 18, 2024 1:03 pm
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…
కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా నడుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…
బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ఒక్కసారిగా రాజకీయ చర్చకు వేదికగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి మంత్రి…
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…