Movie News

సామ్‌లో మ‌ళ్లీ ఆ ఛార్మ్

దక్షిణాదిని తిరుగులని స్టార్ ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించిన హీరోయిన్లలో సమంత ఒకరు. ఆమె విజయశాంతి, నయనతార, అనుష్కల మాదిరి పవర్ ఫుల్ మాస్ రోల్స్ చేయకపోయినా.. తన శైలిలో క్లాస్ సినిమాలు చేస్తూనే భారీగా అభిమాన గణాన్ని సంపాదించుకుంది.

స్టార్ హీరోల సినిమాల్లో గ్లామర్, పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ చేస్తూనే.. యుటర్న్, ఓ బేబీ, యశోద లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోనూ ఆకట్టుకుంది. ఐతే ఎలాంటి హీరోయిన్‌కైనా ఒక దశ తర్వాత అవకాశాలు తగ్గడం, కెరీర్ డౌన్ అవడం మామూలే.

అందులోనూ సమంత పెళ్లి చేసుకోవడంతో ఇక తన కెరీర్ క్లోజ్ అనుకున్నారు. కానీ ఆమె తర్వాత కూడా బలంగా నిలబడింది. కానీ వ్యక్తిగత జీవితంలో ఒడుదొడుకులు, అనారోగ్యం సమంత కెరీర్ మీద ప్రభావం చూపాయి. ముఖ్యంగా అనారోగ్యం తర్వాత కెరీర్ బాగా డౌన్ అయింది.

మయోసైటిస్‌కు చికిత్స తీసుకున్నాక సామ్ లుక్ కూడా మారిపోయింది. సమంతలో ఒకప్పటి ఛార్మ్ మిస్సయిందనే ఫీలింగ్ అభిమానుల్లో కలిగింది. చివరి చిత్రం ‘శాకుంతలం’ డిజాస్టర్ కావడం.. తర్వాత కెరీర్లో గ్యాప్ కూడా రావడం తన కెరీర్ మీద ప్రతికూల ప్రభావం చూపేలా కనిపించింది.

ఇక సమంత కెరీర్ ముగిసినట్లే అనే అభిప్రాయానికి వచ్చేశారు జనం. కానీ సామ్ ‘సిటాడెల్’ వెబ్ సిరీస్‌తో బౌన్స్ బ్యాక్ అయ్యే ప్రయత్నంలో ఉంది. ఈ సిరీస్ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. యాక్షన్ అవతార్‌లో సమంత మెప్పించింది. అందులో సామ్ పాత్ర వినోదమూ పంచేలా ఉంది. ఈ సిరీస్ ప్రమోషన్లలో సమంత చాలా ఆకర్షణీయంగా కనిపించడం విశేషం.

ముఖంలో మునుపటి ఛార్మ్ కనిపించింది. ఓవరాల్ లుక్ కూడా బాగుంది. ఆకర్షణీయమైన స్టైలింగ్ కూడా తోడవడంతో సమంత ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. ఈ సిరీస్ బాగుంటే సామ్ కెరీర్ మళ్లీ వేగం పుంజుకోవడం ఖాయం.

This post was last modified on October 17, 2024 6:18 pm

Page: 1 2 3 4 5 6

Share

Recent Posts

తెల్లదొరల అరాచకంపై ‘రణబాలి’ రణం

విజయ్ దేవరకొండ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందుతున్న రణబాలి…

48 minutes ago

మైక్రోసాఫ్ట్ సహా ఐటీ కంపెనీలకు గ్రీన్ కార్డు షాక్

అమెరికాలోని విదేశీ ఉద్యోగులపై ట్రంప్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మైక్రోసాఫ్ట్ సహా పలు ప్రముఖ కంపెనీలకు గ్రీన్…

49 minutes ago

సేనాపతి మీద అభిమానుల భారం

ఒక అల్ట్రా డిజాస్టర్ కు సీక్వెల్ రావడం చాలా అరుదు. ఆ విషయంలో భారతీయుడు 3 కొత్త రికార్డుని సొంతం…

2 hours ago

అది ప్యారడైజ్ కాకి కాదు

ఈ సోషల్ మీడియా కాలంలో సినిమాల్లో ఎవరిని ఉద్దేశించి ఏ పంచ్ వేసినా.. అది కాంట్రవర్శీగా మారడానికి ఎంతో సమయం…

3 hours ago

యష్ బయటికి వచ్చే టైమయ్యింది

ఎంత పెద్ద స్టార్ హీరోకైనా డిజాస్టర్లు సహజం. ఎన్టీఆర్ ఎంజిఆర్ నుంచి చిరంజీవి జూనియర్ ఎన్టీఆర్ దాకా అందరికీ అనుభవమే.…

3 hours ago

నేరుగా సుప్రీం వద్దకు ఎలా వస్తారు?

రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారిన దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు దంపతులకు…

3 hours ago