ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో ఒకటైన ‘పుష్ప: ది రూల్’ విడుదలకు ఇంకో 50 రోజులే సమయం ఉంది. ఈ చిత్రాన్ని ముందు అనుకున్న ప్రకారం ఆగస్టు 15న రిలీజ్ చేయలేకపోయిన టీం.. కొత్త డేట్ డిసెంబరు 6కు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను థియేటర్లలోకి దించాలని పట్టుదలతో ప్రయత్నం చేస్తోంది.
సినిమాలో ఏ సీన్ లాక్ చేయకుండా రిలీజ్ ముందు రోజు వరకు హడావుడి పడతాడని పేరున్న దర్శకుడు సుకుమార్.. ఈసారి విడుదలకు రెండు నెలల ముందే ఫస్టాఫ్‌ను లాక్ చేసేయడంతో టీం చాలా ఉత్సాహంగా ఉంది. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉండగా.. దాంతో పాటే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సమాంతరంగా జరుగుతున్నాయి.
ఈ నెలాఖరుకు షూట్ మొత్తం పూర్తి చేసి తర్వాత పూర్తిగా ఎడిటింగ్ పనుల్లో సుకుమార్ నిమగ్నమవుతాడని అంటున్నారు. ఇదిలా ఉంటే సినిమా కథ, హైలైట్ల గురించి.. ముఖ్య పాత్రల గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.
‘పుష్ప: ది రైజ్’ను ముగించిన ప్రకారం పార్ట్-2లో భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో ఫాహద్ ఫాజిలే మెయిన్ విలన్ అనే అంచనా ప్రేక్షకుల్లో ఉంది. పుష్పకు, షెకావత్‌కు మధ్య పోరు ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఐతే పుష్ప-2లో ఫాహద్ ఒక్కడే విలన్ కాదు. పుష్ప చాలామందినే ఢీకొట్టాల్సి ఉంది.
కొండారెడ్డి హత్యకు ప్రతీకారం తీర్చుకోవడానికి తన బ్రదర్స్.. అలాగే తన బామ్మర్దిని కోల్పోయినందుకు దెబ్బకు దెబ్బ తీయడానికి మంగళం శీను కూడా రెడీగా ఉంటారు. వీళ్ల పాత్రలు కూడా పుష్ప-2లో కీలకంగా ఉంటాయట. వీరు కాకుండా మరి కొందరు విలన్లు కూడా ఉన్నారు.
ఎంపీ పాత్రలో పుష్ప-1లో పుష్పకు అనుకూలంగానే కనిపించిన రావు రమేష్.. పార్ట్-2లో పుష్పను టార్గెట్ చేస్తాడట. ఆయనతో పాటు ‘కేజీఎఫ్’ ఫేమ్ తారక్ పొన్నప్ప, మలయాళ నటుడు ఆదిత్య మేనన్‌లతో పాటు ‘యానిమల్’ ఫేమ్ సౌరభ్ సచ్‌దేవ్ కూడా ‘పుష్ప-2’లో నటిస్తున్నాడు. ఇంతమంది పవర్ ఫుల్ విలన్లను ఢీకొట్టే క్రమంలో పుష్ప పాత్ర ఇంకా పవర్ ఫుల్‌గా మారుతుందని సమాచారం.
This post was last modified on October 17, 2024 6:19 pm
బిజీ హీరోయిన్ల డేట్లను షెడ్యూల్స్ తగట్టు తెచ్చుకోవడం దర్శక నిర్మాతలకు ఒక్కోసారి పెద్ద సవాల్ గా మారుతుంది. అంత డిమాండ్…
2007 లో విడుదలైన హ్యాపీ డేస్ మూవీతో కుర్ర కారులో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న మిల్కీ బ్యూటీ తమన్న. అగ్ర…
దేశవ్యాప్తంగా హిందీ భాషను రుద్దాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. తమిళనాట…
ఇళయరాజా పేరు ఈ మధ్య కాలంలో తరచుగా వివాదాలతోనే వార్తల్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. వయసు మీద పడడంతో ఆయన…
ఆస్కార్ అవార్డుల్లో ఆధిపత్యం చలాయించే అన్ని సినిమాలకూ వసూళ్లు వస్తాయని గ్యారెంటీ లేదు. అలాగే వసూళ్ల మోత మోగించిన చిత్రాలకూ…
వైసీపీ హయాంలో రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ అమ్మకం, వాడకం విచ్చలవిడిగా పెరిగిపోయాయని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. దేశంలో ఏ…