కొన్నిసార్లు మంచి సినిమాలు థియేటర్లలో ఉన్నా జనాలు సరిగా చూడని పరిస్థితి ఉంటుంది. కొన్నిసార్లేమో ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి సిద్ధంగా ఉన్నా.. సరైన సినిమాలు ఉండవు. దసరా టైంలో ప్రేక్షకుల ఆకలి తీర్చే సినిమాలు పడకపోవడంతో నిరాశ తప్పలేదు. మంచి టైమింగ్‌ను టాలీవుడ్ ఉపయోగించుకోలేకపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
దసరా సందడి ముగిశాక.. ఇప్పుడు మరో వీకెండ్ వస్తోంది. కానీ ఈ వారం బాక్సాఫీస్ దగ్గర ఉన్న ఖాళీని ఉపయోగించుకోవడానికి సినిమాలే లేవు. దసరా సినిమాలు రెండో వారం కూడా ప్రభావం చూపుతాయనే ఉద్దేశంతోనే ఏమో.. ఈ వారాన్ని ఖాళీగా వదిలేశారు. ‘లవ్ రెడ్డి’, ‘కల్లు కాంపౌండ్’ అంటూ కొన్ని చిన్న చిత్రాలేవో వస్తున్నాయి కానీ.. వాటిని ప్రేక్షకులు పట్టించుకునే స్థితిలో లేరు. ఇవి కాక పేరున్న చిత్రం ఒక్కటీ రిలీజ్ కావడం లేదు.
పోనీ ముందు వారంలో వచ్చిన సినిమాలైనా బాగున్నాయా అంటూ అదీ లేదు. సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా ‘వేట్టయన్’ తొలి వీకెండ్లోనే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేకపోయింది. వీకెండ్ తర్వాత సినిమాకు ఆక్యుపెన్సీలు దారుణంగా పడిపోయాయి. తెలుగు నుంచి రిలీజైన సినిమాల్లో ‘విశ్వం’ కొంచెం స్థాయి ఉన్న చిత్రం. దానికీ టాక్ బాలేదు.
వీకెండ్ వరకు ఓ మోస్తరుగా ఆడింది. తర్వాత డల్ అయిపోయింది. జనక అయితే గనక, మా నాన్న సూపర్ హీరో సినిమాలకు వీకెండ్లోనే వసూళ్లు కరవయ్యాయి. తర్వాత కూడా అవి పుంజుకోలేకపోయాయి.
ఈ వీకెండ్లో సినిమా చూద్దామనుకున్నా థియేటర్లకు రప్పించే సినిమాలు కనిపించడం లేదు. ఏ చిత్రం ఎగ్జైటింగ్‌గా లేకపోవడంతో ప్రేక్షకులు ఈ వీకెండ్ సినిమా లైట్ అన్నట్లు ఊరుకునే పరిస్థితి కనిపిస్తోంది. నెలాఖర్లో దీపావళి వీకెండ్ కోసం మ్యాడ్ రష్ ఉంది కానీ.. వచ్చే వారం కూడా చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. దీంతో బాక్సాఫీస్ ఇంకో రెండు వారాలు వెలవెలబోయేలా కనిపిస్తోంది.
This post was last modified on October 18, 2024 9:30 am
టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…
ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…
ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…
టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…
పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…