Movie News

రానా పట్టుబడితే రీమేక్ అవ్వాల్సిందే

ఏదైనా భాషలో హిట్టయిన సినిమాను వీలైనంత త్వరగా రీమేక్ చేసుకుంటేనే సేఫ్. లేదంటే సబ్ టైటిల్స్ పెట్టుకుని ఆడియన్స్ ఓటిటిలో చూసేస్తే ఉన్న థ్రిల్ కాస్తా తగ్గిపోతుంది. గాడ్ ఫాదర్, భీమ్లా నాయక్ లాంటి స్టార్ హీరోల చిత్రాలు అందుకే ఆశించినంత పెద్ద రేంజ్ కి వెళ్లలేకపోయాయి.

2021లో కోలీవుడ్ నుంచి మానాడు వచ్చింది. పెద్ద సక్సెస్. రేసులో వెనుకబడ్డ శింబుకి కొత్త లైఫ్ ఇచ్చింది. ముఖ్యంగా ఆర్టిస్టుగా ఎస్జె సూర్య పెద్ద స్థాయికి వెళ్లేందుకు దోహదపడింది. ఓటిటిలో తెలుగు డబ్బింగ్ తో పాటు అందుబాటులోకి వచ్చాక మన ఆడియన్స్ భారీ సంఖ్యలో చూశారు. అంత పెద్ద రీచ్ ఉంది దీనికి.

మానాడు రీమేక్ హక్కులు సురేష్ సంస్థ ఎప్పుడో కొనుగోలు చేసింది. కానీ హీరో దర్శకుడు దొరక్క వాయిదా పెడుతూ వచ్చారు. సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ఇలా రెండు మూడు పేర్లు వినిపించాయి కానీ అవేవి కార్యరూపం దాల్చలేదు.

ఒకదశలో రవితేజ దగ్గరకు కూడా వెళ్లిందన్నారు కానీ అదంతా పుకారు స్టేజి దగ్గరే ఆగిపోయింది. కట్ చేస్తే ఇప్పుడీ మానాడుని ముందు హిందీలో తీసే ప్లానింగ్ లో ఉన్నాడు రానా. ఆకాశవాణితో దర్శకుడిగా రుజువు చేసుకున్న అశ్విన్ గంగరాజుతో తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. హీరో ఎవరనేది ఇంకా తేలలేదు కానీ క్యాస్టింగ్ పనులు మొదలుపెట్టలేదట.

మరి తెలుగులో తీస్తారా లేదానేది అనుమానంగానే ఉంది. టైం లూప్ కాన్సెప్ట్ ఆధారంగా ఒక సామాన్యుడికి, పోలీస్ ఆఫీసర్ కు మధ్య జరిగే పొలిటికల్ డ్రామాగా రూపొందిన ఈ థ్రిల్లర్ కి దర్శకుడు వెంకట్ ప్రభు. ఫామ్ కోల్పోయిన ఆయనకు నాగచైతన్య, విజయ్ లు ఆఫర్లు ఇచ్చేలా చేసింది మానాడునే.

ఇంత ట్రాక్ రికార్డు ఉన్న బ్లాక్ బస్టర్ త్వరగా రీమేక్ అయ్యుంటే బాగుండేది. సౌత్ లో ఆడిన సినిమాలన్నీ హిందీ రీమేక్ లో ఆడతాయనే గ్యారెంటీ లేదు. జెర్సీ, హిట్ ది ఫస్ట్ కేస్, అల వైకుంఠపురములో లాంటివి దారుణంగా పోయాయి. అందుకే రానా నార్త్ ఆడియన్స్ కు తగ్గట్టు కీలక మార్పులు చేయించాడట. 

This post was last modified on October 18, 2024 9:30 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

దేవరకొండా… ఇక ఆ సినిమా దేవుడికేనా?

తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…

1 hour ago

బిగ్ బాస్-9‌లో ఇతనే పెద్ద సర్ప్రైజ్

ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…

2 hours ago

‘అఖండ’ బాంబు… ఎవరిపై పడుతుందో?

దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…

5 hours ago

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని…

5 hours ago

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

6 hours ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

8 hours ago