రాజమౌళికి కీరవాణి ఎలాగో సుకుమార్ కు కూడా దేవిశ్రీప్రసాద్ అలానే. ఈ కాంబినేషన్ లో ఏ సినిమా స్టార్ట్ చేసినా మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో అసలు మార్పు ఉండదని అందరికి తెలిసిన విషయమే. వీరి కలయికలో వచ్చే అవుట్ ఫుట్ కూడా సాలీడ్ గా ఉంటుంది. కెరీర్ మొదటి నుంచి కూడా ఈ బంధానికి బ్రేకులు పడలేదు అంటే వారి బాండింగ్ ఎంత బలంగా ఉందొ అర్థం చేసుకోవచ్చు.
ఇక దేవిశ్రీప్రసాద్, సుకుమార్ తరువాత ఆ మధ్య కొరటాలతో కంటిన్యూగా సినిమాలు చేశాడు. అయితే ఆచార్యతో అది బ్రేక్ అయ్యింది. త్రివిక్రమ్ ఒక టైమ్ లో కంటిన్యూగా జర్నీ చేసినా ఆ తరువాత థమన్ కు షిఫ్ట్ అయిపోయాడు. ఇక సుకుమార్ టీమ్ లో ఉంటే యువ దర్శకులు అందరూ దేవికి చాలా క్లోజ్. ఉప్పెన వరకు కూడా సుకుమార్ శిష్యులు చేసే సినిమాలకు అతను మ్యూజిక్ చేస్తూ వచ్చాడు.
బడ్జెట్ తో సంబంధం లేకుండా కుమారి 21F లాంటి చిన్న సినిమాకు కూడా వర్క్ చేశాడు. కానీ ఉప్పెన తరువాత ఎందుకనో సుకుమార్ శిష్యులు సైతం రాక్ స్టార్ పై పెద్దగా ఫోకస్ చేసినట్లు అనిపించడం లేదు. ఆ చిత్ర దర్శకుడు బుచ్చిబాబు RC16 కోసం ఏకంగా రెహమాన్ ను తీసుకోవడం షాకింగ్ అనే చెప్పాలి. సుకుమార్ ప్రియ శిష్యులలో ఒకరైన శ్రీకాంత్ ఓదెల కూడా దసరా సినిమాకు దేవిని తీసుకోలేదు.
ఇక ఇప్పుడు నానితో మరో సినిమా సెట్టవ్వగా అనిరుధ్ ను తీసుకోవడం మరో షాకింగ్ న్యూస్. నిజానికి శ్రీకాంత్ ఈ సినిమాకు దేవిని తీసుకోవాలని అనుకున్నాడుట. కానీ ఏమైందో ఏమో గాని మళ్ళీ నిర్ణయం మారింది. ఏదేమైనా దేవి కాంబినేషన్ కనెక్షన్ లైన్స్ మెల్లగా కట్ అవుతున్నట్లు అనిపిస్తుంది. మరి పుష్ప 2 తరువాత అందరి ఫోకస్ తనపై పడేలా చేస్తాడో లేదో చూడాలి.
This post was last modified on October 17, 2024 9:49 am
గేమ్ ఛేంజర్ కు తెలుగులో డాకు మహారాజ్- సంక్రాంతికి వస్తున్నాం, తమిళంలో విడాముయార్చి పోటీ గురించే చూస్తున్నాం కానీ హిందీలోనూ…
సెప్టెంబర్ లో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన దేవర జపాన్ విడుదలకు రెడీ అవుతోంది. వచ్చే ఏడాది మార్చి…
బడ్జెట్ పరంగా పండగ సినిమాల్లో గేమ్ ఛేంజర్ పెద్దది కాగా సంక్రాంతికి వస్తున్నాం చిన్నది. స్టార్ స్టేటస్ పక్కనపెడితే ఇది…
టాలీవుడ్ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ సందర్భంగా ఇండస్ట్రీ పెద్దల ముందు…
ఏ సినిమాకైనా ఎడిటింగ్ టేబుల్ దగ్గర కోతకు గురైన సీన్లు, భాగాలు ఖచ్చితంగా ఉంటాయి. ఒకవేళ అవి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని…
కొన్ని నెలల కిందట జానీ మాస్టర్ మీద వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు, తనపై నమోదైన కేసు ఎంతటి సంచలనం…