Movie News

దీపావళికే కాదు.. క్రిస్మస్‌కూ వేలం వెర్రే

ఏదైనా పెద్ద పండుగ వచ్చినపుడు మంచి క్రేజున్న సినిమాలు రిలీజ్ చేయడం మామూలే. ఐతే ఎంత పండుగ అయినా సరే రెండు లేదా మూడు సినిమాలను రిలీజ్ చేస్తే రీజనబుల్ అనిపిస్తుంది. కానీ పరిమితికి మించి సినిమాలు విడుదల చేయడం వల్ల అసలుకే మోసం వచ్చే పరిస్థితి నెలకొంటోంది. ఇటీవలే దసరాకు నాలుగు సినిమాలు రిలీజ్ చేశారు. వాటిలో ఏదీ ఆశించిన ఫలితాన్నందుకోలేదు. తర్వాత దీపావళి మీదికి ఫోకస్ మళ్లింది. ఆ పండక్కి అనువాద చిత్రాలతో కలిపి ఏకంగా అరడజను సినిమాలను అనౌన్స్ చేయడం గమనార్హం.

టాలీవుడ్‌కు పెద్దగా కలిసి రాని దీపావళి టైంలో ఇన్ని సినిమాలు రిలీజ్ చేయడమేంటో అంతుబట్టడం లేదు. రిలీజ్ టైంకి ఒకట్రెండు సినిమాలేమైనా వెనక్కి తగ్గుతాయేమో చూడాలి. దీని తర్వాత పండుగ సీజన్ అయిన క్రిస్మస్ విషయంలోనూ ఇదే వేలం వెర్రి కనిపిస్తోంది.

క్రిస్మస్‌కు అనుకున్న రామ్ చరణ్ సినిమా ‘గేమ్ చేంజర్’ను సంక్రాంతికి వాయిదా వేయడంతో.. ఈ పండక్కి పోటీ పెరిగిపోతోంది. ఆల్రెడీ ఈ సీజన్‌కే అనౌన్స్ అయిన ‘రాబిన్ హుడ్’ అనుకున్న ప్రకారమే రాబోతోంది. ‘గేమ్ చేంజర్’ వస్తే ఆ సినిమా క్రిస్మస్ రేసు నుంచి తప్పుకునేది. కానీ ‘గేమ్ చేంజర్’ వాయిదా పడడంతో ‘రాబిన్ హుడ్’ క్రిస్మస్‌కే రానుంది. ‘తండేల్’ను కూడా క్రిస్మస్‌కు అనే ముందు ప్రకటించారు. ‘రాబిన్ హుడ్’ తరహాలోనే ‘గేమ్ చేంజర్’ రావడాన్ని బట్టి దీని డేట్ మారుతుందని అన్నారు. మరి ‘గేమ్ చేంజర్’ సంక్రాంతికి రానున్న నేపథ్యంలో ‘తండేల్’ క్రిస్మస్‌కే వస్తుందేమో చూడాలి.

ఈ సినిమా సంగతి తేలే లోపు కొత్తగా క్రిస్మస్ రేసులోకి సినిమాలను తీసుకొస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్లో ‘జెర్సీ’ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి రూపొందించిన ‘మ్యాజిక్’ క్రిస్మస్ రేసులోకి వచ్చింది. మరోవైపు ఉపేంద్ర పాన్ ఇండియా మూవీ ‘యుఐ’ కూడా క్రిస్మస్ బరిలో దిగబోతోంది. తమిళ అనువాదం విడుదల-2ను క్రిస్మస్‌కే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. మరోవైపు హాలీవుడ్ మూవీ ‘ముఫాసా: ది లయన్ కింగ్’ కూడా క్రిస్మస్‌కు తెలుగులో మంచి అంచనాలతో విడుదల కాబోతోంది. ఇంత పోటీలో సినిమాలు రిలీజ్ చేయడం ఎవరికైనా రిస్కే.

This post was last modified on October 17, 2024 9:47 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈవన్నీ చేస్తే AP టూరిజంకు తిరుగుండదు

జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…

1 hour ago

రేవంత్ రెడ్డి.. అదానీ ఒప్పందాలు రద్దు చేస్తారా?

అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…

2 hours ago

మంచు విష్ణు అసలు ప్లానింగ్ ఇదా

మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…

3 hours ago

సాక్షి మీడియా నన్ను కవర్ చేయదు…షర్మిల సెటైర్లు

మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…

3 hours ago

రెహమాన్ పై రూమర్స్.. బాధతో తనయుడి వివరణ

ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…

3 hours ago