మంచు విష్ణు కన్నప్ప విడుదల తేదీ ఇంకా ఖరారు కాలేదు. డిసెంబర్ రిలీజని గతంలో ప్రకటించారు కానీ గేమ్ ఛేంజర్ వస్తుందని తెలిసి మౌనం వహించారు. ఇప్పుడది జనవరి సంక్రాంతికి షిఫ్ట్ అయిపోవడంతో స్లాట్ ఖాళీ అయ్యింది. అయితే విష్ణు టీమ్ ఏమరుపాటుగా ఉండి ఆలస్యం చేయడం వల్ల మిగిలిన నిర్మాతలు కర్చీఫ్ లు వేసుకుంటున్నారు. రాబిన్ హుడ్ లాంటి భారీ బడ్జెట్ చిత్రంతో మొదలుపెట్టి సారంగపాణి జాతకం లాంటి చిన్న సినిమా దాకా అందరూ డిసెంబర్ 20, 21 తేదీలను లక్ష్యంగా పెట్టేసుకున్నారు. ఇంత జరుగుతున్నా కన్నప్ప బృందం నుంచి ఎలాంటి అనౌన్స్ మెంట్ లేదు.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం జాప్యం చేయడం వెనుక కొన్ని కారణాలున్నాయట. కన్నప్ప చాలా ప్రెస్టీజియస్ ప్యాన్ ఇండియా మూవీ. విష్ణు బిజినెస్ కూడా అదే స్థాయిలో ఎక్స్ పెక్ట్ చేస్తున్నాడు. ముఖ్యంగా ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ లాంటి స్టార్ క్యామియోలను పెట్టుకుని ఆషామాషీ రేట్లకు అమ్మే ఉద్దేశంలో లేడు. అయితే కంటెంట్ ఎలా ఉంటుందోననే అనుమానం బయ్యర్లలో లేకపోలేదు. టీజర్ కొచ్చిన స్పందన మిశ్రమంగా ఉంది. పాత్రలను పరిచయం చేస్తూ వదిలిన పోస్టర్లు ఎగ్జైట్ మెంట్ పెంచలేకపోయాయి. ఈ ప్రతికూలతలకు సమాధానం చెప్పాలంటే పవర్ ఫుల్ ట్రైలర్ కావాలి.
అది వచ్చాక డిస్ట్రిబ్యూటర్లకు నమ్మకం కలుగుతుంది. అందుకే మంచు విష్ణు సమయం తీసుకుంటున్నట్టు తెలిసింది. దర్శకుడికి ఎలాంటి బ్రాండ్ లేదు. కేవలం క్యాస్టింగ్ మీదే మార్కెటింగ్ చేయాలి. పైగా ఇందులో నటించినవాళ్లు ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు. ప్రమోషన్ల కోసం వాళ్ళ డేట్లను ముందే లాక్ చేసుకోవాలి. పోస్ట్ ప్రొడక్షన్ వేగవంతం చేయాలి. విఎఫెక్స్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వల్లే కొంత లేట్ అవుతోందని, నవంబర్ లోగా అన్ని పనులు పూర్తవుతాయని తెలుస్తోంది. ఒకవేళ డిసెంబర్, జనవరిలు మిస్ అయితే మాత్రం 2025 శివరాత్రిని టార్గెట్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్. చూడాలి మరి ఏం చేస్తారో.
This post was last modified on October 16, 2024 6:10 pm
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……