‘బాహుబలి’ తర్వాత ‘పాన్ ఇండియా’ పేరుతో చాలా సినిమాలు వచ్చాయి. కానీ వాటిలో నిజంగా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను మెప్పించి విజయం సాధించిన సినిమాలు చాలా తక్కువ. కానీ పాన్ ఇండియా మీద పెద్దగా ఫోకస్ పెట్టకపోయినా.. అనూహ్యంగా ఆ స్థాయిలో ఆదరణ దక్కించుకుని ఘనవిజయం సాధించిన చిత్రాలున్నాయి. కేజీఎఫ్, పుష్ప, కాంతార, కార్తికేయ-2 లాంటి సినిమాలు అందుకు ఉదాహరణ.
వీటిలో కాంతార, కార్తికేయ-2 పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ కావడం పెద్ద షాకే. వీటికి కలిసొచ్చిన అంశం.. వాటిలో కథాంశం దేవుళ్లతో, హిందూ సంస్కృతితో ముడి పడి ఉండడం. ఆ తరహా చిత్రాలను ఇప్పుడు ప్రేక్షకులు బాగా ఇష్టపడుతున్నారు. భాషా భేదం లేకుండా వాటిని ఆదరిస్తున్నారు. అందుకే ఇటీవల కథల్లోకి ఈ అంశాలను జొప్పించే ప్రయత్నం జరుగుతోంది.
టాలీవుడ్లో లేటెస్ట్‌గా మొదలైన ‘అఖండ-2’ అనౌన్స్‌మెంట్ వీడియో చూస్తే.. దర్శకుడు బోయపాటి శ్రీను కూడా ట్రెండును బాగానే అర్థం చేసుకుంటున్నాడని అర్థమవుతోంది. ‘అఖండ’ మూవీని కూడా ఉత్తరాది ప్రేక్షకులు బాగానే చూశారు. ఓటీటీలో ఈ సినిమా రిలీజైనపుడు నార్త్ ఇండియాలో కూడా ట్రెండ్ అయింది. అందులో హీరో దైవాంశ సంభూతుడిగా కనిపిస్తాడు. హిందూ సంస్కృతి, దేవాలయాల గురించి పవర్ ఫుల్ డైలాగ్స్ ఉంటాయి. అవి మన ప్రేక్షకులకే కాక నార్త్ ఆడియన్స్‌కు కూడా నచ్చాయి. ఈ నేపథ్యంలోనే ‘అఖండ-2’లో ఈ అంశాలను మరింత ఎలివేట్ చేసే ప్రయత్నం జరుగుతున్నట్లు కనిపిస్తోంది. అనౌన్స్‌మెంట్ వీడియో అంతా కూడా దేవుడు, సంస్కృతి ప్రధానంగా సాగాయి.
ముహూర్తం షాట్‌లో బాలయ్య చెప్పిన డైలాగ్ కూడా శివుడి మీదే కావడం విశేషం. చూస్తుంటే ‘అఖండ-2’ను పాన్ ఇండియా లెవెల్లో బాగా ప్రమోట్ చేసి అక్కడ కూడా పెద్ద స్థాయిలో రిలీజ్ చేసేలా ఉన్నారు. కథాంశానికి అక్కడి ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారంటే కాంతార, కార్తికేయ-2 తరహాలో పెద్ద సక్సెస్ కావడం ఖాయం.
This post was last modified on October 16, 2024 6:06 pm
ఇప్పటి ట్రెండ్ లో హీరోయిజం అంటే ఎంత హింస ఉంటే అంత కిక్కని భావిస్తున్నారు దర్శకులు. ఎమోషన్, యాక్షన్ కన్నా…
సంక్రాంతి పండక్కు అందరికంటే ముందు వస్తున్న ఆనందం, అడ్వాంటేజ్ రెండూ గేమ్ ఛేంజర్ కు అనుకూలంగా ఉంటాయి. టాక్ పాజిటివ్…
టాలీవుడ్లో సమస్యలు ఎదురైనప్పుడు.. వాటిని పరిష్కరించే వ్యూహాలు.. చతురత ఉన్న ప్రముఖుల కోసం.. ఇప్పుడు నటులు, నిర్మాతలు ఎదురు చూసే…
ఐఏఎస్ అధికారి.. శ్రీలక్ష్మి గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా తెలుసు. దీనికి కారణం .. దేశంలోనే…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు మరో బీసీ మంత్రాన్ని పఠిస్తున్నారు. వారికి ఇప్పటికే.. సరైన సముచిత ప్రాధాన్యం కల్పించిన…
‘పవర్’ లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయమైన బాబీ.. ఆ తర్వాత ‘సర్దార్ గబ్బర్ సింగ్’తో ఎదురు దెబ్బ…