Movie News

గోపిచంద్.. విలన్ గా ఎందుకు చేయట్లేదంటే..

మ్యాచో స్టార్ గోపిచంద్ మొదట హీరోగానే ఎంట్రీ ఇచ్చినప్పటికీ రెండవ అడుగు మాత్రం ప్రతినాయకుడి పాత్రల వైపు మళ్లింది. విలన్ గా ఓ మూడు సినిమాలు చేసిన తరువాత హీరోగా ఎన్నో సినిమాలు చేశాడు. కానీ ప్రేక్షకులను మాత్రం ఎక్కువగా హుక్ చేసింది నెగెటివ్ రోల్స్ తోనే. జయం సినిమా రీమేక్ చేయగా ఆ పాత్రకు గోపి తప్ప మరొకరు సెట్ కారని, తమిళ్ వెర్షన్ లో కూడా అతన్నే తీసుకున్నారు. ఆ రేంజ్ లో ఇంపాక్ట్ చూపించిన గోపి.. వర్షం, నిజం సినిమాలతో మరొక లెవెల్లో ఆకట్టుకున్నాడు.

‘ఒక్కడు’ విలన్ క్యారెక్టర్ కోసం కూడా మొదట గోపినే అనుకున్నారు. కానీ అదే టైమ్ లో మహేష్ నిజం సెట్స్ పై ఉండడం వలన సేమ్ కాంబినేషన్ అని రిపీట్ చేయలేదు. విలన్ గా పర్ఫెక్ట్ యాక్టర్ అనిపించుకున్న గోపి ఆ తరువాత యజ్ఞం, లక్ష్యం, రణం, శౌర్యం, సాహసం, లౌక్యం అంటూ మాస్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు.

అయితే గోపిచంద్ ఈ మధ్య కాలంలో హీరోగా చేసిన ఏ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా క్లిక్కవ్వలేదు. ఇక గోపి అప్పుడప్పుడు గౌతమ్ నందా లాంటి డిఫరెంట్ కథలు కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాడు. కానీ ఆ కథలతోనూ రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లోనే వెళుతుండడం వలన కెరీర్ కు అదే మైనస్ గా మారింది అనే భావన కూడా ఉంది. ఇక ఇప్పుడు ‘విశ్వం’తో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలి అనుకుంటున్నాడు. అయితే విలన్ గా ఎందుకు చేయడం లేదనే.. కామెంట్స్ కు గోపి సమాధానం ఇచ్చారు.

చేయాలనే ఆలోచన ఉన్నప్పటికీ సరైన కథ, క్యారెక్టర్ తగలడం లేదని ఓపెన్ గా చెప్పాడు. ‘నేను విలన్ గా చేసిన సినిమాలోని క్యారెక్టర్స్ చూసుకుంటే హీరోలతో సమానంగా పవర్ఫుల్ గా ఉంటాయి. ఆ క్యారెక్టర్స్ ఇంపాక్ట్ వల్లే నేను హీరోగా చేసినప్పటికీ ఆడియెన్స్ ఆదరించారు. అలాగే నటుడిగా అప్పుడు నేను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ సినిమాలు చేశాను. ఏదేమైనా ఇప్పుడు కూడా అలాంటి క్యారెక్టర్స్ వస్తే చేయడానికి ఇబ్బంది లేదు. కానీ క్యారెక్టర్ కూడా హుక్ చేసే విధంగా ఉండాలి. మంచి క్యారెక్టర్ వస్తే చేయడానికి సిద్ధమే..’ అంటూ గోపి ఓ క్లారిటీ ఇచ్చాడు. అలాగే మరోసారి ప్రభాస్ తో ఛాన్స్ వస్తే, విలన్ గా నటించేందుకు రెడీ అంటూ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. మరి గోపికి కనెక్ట్ అయ్యే విలన్ వేషాలు ఎప్పుడు వస్తాయో చూడాలి.

This post was last modified on October 16, 2024 1:44 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

2024 ఖేల్ రత్న విజేతలు.. కంప్లీట్ లిస్ట్ ఇదే!

ఖేల్ రత్న అవార్డులు: గుకేశ్, మను బాకర్ సహా నలుగురికి గౌరవం భారత ప్రభుత్వం 2024 సంవత్సరానికి గాను మేజర్…

2 hours ago

అభిమానుల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ అద్భుత సందేశం… పాటిస్తారా?

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. త‌న అభిమానుల‌కు అద్భుత సందేశం ఇచ్చారు. త‌న‌ను అభిమానిం చేవారు... త‌ప్ప‌కుండా పాటించాల‌ని…

2 hours ago

మహేష్-రాజమౌళి సినిమా రిలీజ్.. చరణ్ అంచనా

ఇండియాస్ హైయెస్ట్ బడ్జెట్, మోస్ట్ హైప్డ్ మూవీకి ఈ రోజే ముహూర్త వేడుక ముగిసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు…

2 hours ago

హింసను ఇష్టపడుతున్న 5జి ప్రేక్షకులు

ఇప్పుడంతా ఇంటర్ నెట్ ప్రపంచం. కొన్ని నిముషాలు మొబైల్ డేటా లేకపోయినా, ఇంట్లో వైఫై పనిచేయకపోయినా ఏదో భూమి బద్దలైపోయి…

4 hours ago

మహేష్ – రాజమౌళి : ఇది కూడా రహస్యమేనా జక్కన్నా…

ఈ సోషల్ మీడియా కాలంలో పెద్ద పెద్ద సినిమాలకు సంబంధించి కూడా ఆన్ లొకేషన్ ఫొటోలు, వీడియోలు లీక్ అయిపోతుంటాయి.…

6 hours ago