పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత ఏడాది మూడు సినిమాలను పెండింగ్‌లో పెట్టి రాజకీయాల్లో బిజీ అయిపోయాడు. దాదాపు ఏడాది నుంచి ఆయన సినిమాల చిత్రీకరణలు జరగట్లేదు. ఎన్నికల ఫలితాలు వచ్చాక పవన్ ఏకంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిపోవడంతో బాధ్యతలు పెరిగిపోయాయి. వెంటనే సినిమాల గురించి ఆలోచించే పరిస్థితి లేకపోయింది. ప్రభుత్వం ఏర్పాటై నాలుగు నెలలు గడిచింది. ఇప్పుడే కొంచెం తీరిక చేసుకుని మళ్లీ షూటింగ్‌కు హాజరు కావడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఐతే ఆయన తిరిగి ఏ చిత్రాన్ని పట్టాలెక్కిస్తాడు అనే విషయంలో ఉత్కంఠ నెలకొంది.
ఓవైపు ‘హరిహర వీరమల్లు’, మరోవైపు ‘ఓజీ’ చిత్రాలు షూట్‌కు సన్నాహాలు చేసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. కొన్ని రోజుల కిందటే ‘హరిహర వీరమల్లు’ టీం కొత్త షెడ్యూల్ గురించి అప్‌డేట్ ఇచ్చింది. తాజాగా ‘ఓజీ’ టీం నుంచి కూడా అలాంటి అప్‌డేటే వచ్చింది.
‘ఓజీ’ సినిమాకు ఛాయాగ్రహణం అందిస్తున్న లెజెండరీ సినిమాటోగ్రాఫర్ రవివర్మన్.. తాను తిరిగి ‘ఓజీ’ షూట్‌కు వచ్చేసినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. చాలా బిజీగా ఉండే రవివర్మన్.. ఇలా అప్‌డేట్ ఇచ్చాడు అంటే షూట్ పున:ప్రారంభం అవుతున్నట్లే భావించాలి. బహుశా ప్రస్తుతం చిత్రీకరణకు ఏర్పాట్లు జరుగుతుండొచ్చు. రవివర్మన్ అందులో బిజీగా ఉండొచ్చు. పవన్ ఒకట్రెండు రోజుల్లో చిత్రీకరణలో పాల్గొంటాడని భావిస్తున్నారు. కొన్ని రోజుల ముందు వరకు గుబురు గడ్డంతో కనిపించిన పవన్.. తాజాగా ఆ గడ్డంతో పాటు జుట్టునూ తగ్గించాడు. ఆ లుక్ చూస్తే అది ‘ఓజీ’ కోసమే అయి ఉంటుందని భావిస్తున్నారు.
పవన్ ప్రస్తుతం డిప్యూటీ సీఎం కాబట్టి.. ఆయన మళ్లీ చిత్రీకరణలో పాల్గొంటున్న విషయం గురించి ఆయా చిత్ర బృందాలు మరీ హడావుడి చేస్తే కష్టం. అది జనాలకు రాంగ్ సిగ్నల్స్ ఇస్తుంది. కాబట్టి పవన్ కూడా తన టీం ఎక్కువ హడావుడి చేయకుండా సైలెంట్‌గా షూటింగ్ చేసి రావడానికే ప్రాధాన్యమిస్తుండొచ్చు. పవన్ అధికారిక, రాజకీయ కార్యకలాపాలకు ఎక్కువ ఇబ్బంది రాకుండా షూట్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
This post was last modified on October 16, 2024 11:34 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…