Health

నాగార్జున 2 ఎక‌రాలు ఇచ్చారు-రేవంత్ రెడ్డి

తెలంగాణ‌లో రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక అక్ర‌మ క‌ట్ట‌డాల‌పై ఉక్కుపాదం మోప‌డం.. ఈ క్ర‌మంలో గ‌త ఏడాది హైద‌రాబాద్‌లో అక్కినేని నాగార్జున‌కు చెందిన ఎన్ క‌న్వెన్ష‌న్‌ను కూల్చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే. నాగార్జున‌ను కావాల‌నే రేవంత్ టార్గెట్ చేశారంటూ ఓ వ‌ర్గం ఆయ‌న‌పై మండిప‌డితే.. ప్ర‌భుత్వం స‌రైన ప‌నే చేసిందంటూ ఇంకో వ‌ర్గం వాదించింది. దీనిపై నాగార్జున త‌ర్వాతి రోజుల్లో ఎలా స్పందిస్తాడా.. కోర్టులో ఎలా పోరాడ‌తాడా అని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూశారు. ఐతే నెమ్మ‌దిగా వ్య‌వ‌హారం స‌ద్దుమ‌ణిగిపోయింది. ఇటీవ‌ల త‌న కొడుకు పెళ్లికి ఆహ్వానించ‌డానికి.. త‌ర్వాత మిస్ ఇండియా ఈవెంట్ సంద‌ర్భంగా రేవంత్‌ను క‌లిసి ఆయ‌న‌తో స‌న్నిహితంగా క‌నిపించారు నాగ్.

కాగా ఇప్పుడు సీఎం రేవంత్ నాగార్జున గురించి ఒక కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ ప్ర‌శంస‌లు కురిపించ‌డం అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించింది. హైడ్రా ఆధ్వ‌ర్యంలో అక్ర‌మ క‌ట్ట‌డాల కూల్చి వేత గురించి సీఎం రేవంత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. గ‌త ఏడాది నాగార్జున‌కు చెందిన ఎన్ క‌న్వెన్ష‌న్‌ను చెరువు ప‌రిధిలో ఉంద‌నే కూల్చివేశామ‌ని రేవంత్ స్ప‌ష్టం చేశారు. ఆ స‌మ‌యంలో చాలామంది విమ‌ర్శ‌లు చేశార‌ని ఆయ‌న గుర్తు చేసుకున్నారు.

ఐతే ప్ర‌భుత్వం మంచి ఉద్దేశంతోనే ఈ ప‌ని చేసింద‌ని అర్థం చేసుకున్న నాగార్జున‌.. త‌ర్వాత అక్క‌డున్న రెండు ఎక‌రాల స్థలాన్ని ప్ర‌భుత్వానికి ఇచ్చేసి త‌న పెద్ద మ‌న‌సును చాటుకున్నార‌ని కొనియాడారు రేవంత్ రెడ్డి. అక్ర‌మ క‌ట్ట‌డాల కూల్చివేత విష‌యంలో త‌మ‌ది రాజీ లేని విధానం అని రేవంత్ స్ప‌ష్టం చేశారు. హైద‌రాబాద్ ప‌రిధిలోని బ‌తుక‌మ్మ కుంట‌లో ఆరు ఎక‌రాల స్థ‌లాన్ని బీఆర్ఎస్ నేత‌లు క‌బ్జా చేసుకున్నార‌ని.. దాని మీద కాంగ్రెస్ నేత‌లు ఎప్ప‌ట్నుంచో పోరాడుతున్నార‌ని… ఆ స్థ‌లాన్ని కూడా ప్ర‌భుత్వం స్వాధీనం చేసుకుని ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డేలా చేస్తోంద‌ని ఆయ‌న‌న్నారు.

This post was last modified on June 29, 2025 10:52 am

Share

Recent Posts

జడలు విదిలించిన వసూళ్లు… ఇకపై అసలు సవాళ్లు

బుధవారం ప్రీమియర్లతో గురువారం విడుదల ఎంచుకున్న ది ప్యారడైజ్ ఎట్టకేలకు మొదటి వీకెండ్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రాధమిక సమాచారం…

40 minutes ago

అమ్మ చేతులు అడుక్కోకూడదు

తెలుగులో లెజెండరీ స్టేటస్ ఉన్న దర్శకుల్లో పూరి జగన్నాథ్ ఒకడు. బద్రి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న…

47 minutes ago

యువకుడి చెంప ఛెళ్లుమనిపించిన మంత్రి

ఈ మధ్యకాలంలో కొందరు రాజకీయ నేతలు తమను తాము వేరే లెవల్లో ఊహించుకుంటున్నారు. ప్రజలు ఎన్నుకుంటేనే తాము ప్రజాప్రతినిధులుగా చలామణీ…

1 hour ago

గ్రేట‌ర్‌లో పుంజుకునేదెలా… కారు పార్టీ కుస్తీలు

గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీకి వ‌రుస దెబ్బ‌లు త‌గులుతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత‌.. పార్టీ పుంజుకుంటున్న ప‌రిస్థితి…

3 hours ago

సూర్య‌తో సినిమా ఎప్పుడు… రాజ‌మౌళి జ‌వాబేంటి?

రాజ‌మౌళితో సినిమా చేయాల‌ని ఇప్పుడు ఇండియాలో ఉన్న‌ ప్ర‌తి పేరున్న హీరో ఆశ‌ప‌డుతుంటాడు అన‌డంలో సందేహం లేదు. ఐతే రాజ‌మౌళి…

4 hours ago

`వ‌ర్గాల‌`కు దూర‌మ‌వుతున్న వైసీపీ.. ?

రాష్ట్ర రాజకీయాల్లో ప్ర‌త్య‌ర్థుల‌తో వైరం ఎలా ఉన్నా.. ప్ర‌జ‌ల‌తో మాత్రం పార్టీల‌కు సాన్నిహిత్యం ఉండాలి. అది కొర‌వ‌డితే.. ఎప్పటికీ చేరువ…

5 hours ago