ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ కారణంగా చాలామంది ఊబకాయం ,బెల్లీ ఫ్యాట్ తో భాద పడుతున్నారు. మరీ ముఖ్యంగా సన్నగా ఉండే వారిని కూడా బెల్లీ ఫ్యాట్ చాలా ఇబ్బంది పెడుతుంది. ఇది కేవలం శరీర ఆకృతిని ప్రభావితం చేయడం కాకుండా, పలు ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. చాలామంది వ్యాయామం చేస్తూ, డైట్ పాటిస్తూ ఉన్నా పొట్ట తగ్గడం లేదని ఫీల్ అవుతుంటారు. అయితే, సరైన ఆహారం తీసుకుంటే బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవచ్చు. మీ బెల్లీ ఫ్యాట్ని సులభంగా కరిగించడం కోసం కొన్ని ఫ్రూట్స్ మీ డైట్ లో భాగంగా చేసుకుంటే సరిపోతుంది.. మరి ఆ ఫ్రూట్స్ వో తెలుసుకుందామా..
పండ్లలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. అవి మన శరీరానికి అవసరమైన విటమిన్స్ అందించడంతోపాటు శరీరంలోని మలినాలను తొలగించడంలో కూడా సహాయపడతాయి. ముఖ్యంగా ఫైబర్ పుష్కలంగా ఉండే పండ్లు ఆకలిని నియంత్రించి, ఎక్కువ తినకుండానే కడుపు నిండిన ఫీలింగ్ ఇస్తాయి. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
బెర్రీ , జామ
స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ వంటి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ మంచి మోతాదులో ఉంటాయి. ఇవి శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి. అలాగే జామ పండులో కూడా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఆకలి తగ్గించి తక్కువ తినేలా చేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు కూడా జామ పండ్లను తినవచ్చు.
యాపిల్
ప్రతి రోజు ఒక యాపిల్ తింటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. యాపిల్ లో ఉండే ఫైబర్,విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు జీర్ణవ్యవస్థను క్రమబద్ధీకరిస్తాయి.
ద్రాక్ష, బొప్పాయి, నారింజ
ద్రాక్షలో ఉండే పోషకాలు మన శరీరంలో ఇన్సులిన్ స్థాయిని నియంత్రిస్తాయి. అలాగే బొప్పాయి, నారింజ వంటి పండ్లలో ఉండే న్యూట్రియెంట్స్ జీర్ణక్రియను మెరుగుపరచి బెల్లీ ఫ్యాట్ తగ్గించడంలో తోడ్పడతాయి.
పైనాపిల్, కివీ
పైనాపిల్‌లో బ్రోమెలైన్ అనే పదార్థం ఉంటుంది. ఇది బ్లోటింగ్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. కివీలో విటమిన్ సి, ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది కూడా బరువు తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవాలంటే రోజువారీ జీవనశైలిలో వ్యాయామంతో పాటు మంచి ఆహారం కూడా అవసరం.పై పేర్కొన్న పండ్లను తినడం ద్వారా మనం ఆరోగ్యంగా ఉండొచ్చు, అలాగే బెల్లీ ఫ్యాట్ ను కూడా కంట్రోల్ చేయొచ్చు.
గమనిక: ఈ సమాచారం సాధారణ ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. మీకు అనుమానాలు ఉంటే, లేదా కొత్త ఆహార అలవాట్లు మొదలుపెట్టాలనుకుంటే, ముందు వైద్యుని సంప్రదించండి.
This post was last modified on April 16, 2025 7:09 pm
బుధవారం ప్రీమియర్లతో గురువారం విడుదల ఎంచుకున్న ది ప్యారడైజ్ ఎట్టకేలకు మొదటి వీకెండ్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రాధమిక సమాచారం…
తెలుగులో లెజెండరీ స్టేటస్ ఉన్న దర్శకుల్లో పూరి జగన్నాథ్ ఒకడు. బద్రి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న…
ఈ మధ్యకాలంలో కొందరు రాజకీయ నేతలు తమను తాము వేరే లెవల్లో ఊహించుకుంటున్నారు. ప్రజలు ఎన్నుకుంటేనే తాము ప్రజాప్రతినిధులుగా చలామణీ…
గ్రేటర్ హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాత.. పార్టీ పుంజుకుంటున్న పరిస్థితి…
రాజమౌళితో సినిమా చేయాలని ఇప్పుడు ఇండియాలో ఉన్న ప్రతి పేరున్న హీరో ఆశపడుతుంటాడు అనడంలో సందేహం లేదు. ఐతే రాజమౌళి…
రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యర్థులతో వైరం ఎలా ఉన్నా.. ప్రజలతో మాత్రం పార్టీలకు సాన్నిహిత్యం ఉండాలి. అది కొరవడితే.. ఎప్పటికీ చేరువ…