Health

మీ పిల్లలు లంచ్ బాక్స్ లో ఇవి పెడుతున్నారా? అయితే జాగ్రత్త…

పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం తినిపించడం ఈ రోజుల్లో పెద్ద సవాళుగా మారింది. తల్లిదండ్రులు ఎన్ని ప్రయత్నాలు చేసినా, పిల్లలు తమ ఇష్టమైన జంక్ ఫుడ్ తినడానికే ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తున్నారు. అయితే, పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, సరైన పోషకాలను అందించే ఆహారాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం.

ముఖ్యంగా, పాఠశాలకు వెళ్తున్న పిల్లల కోసం సరైన ఆహారం అందించకపోతే, వారి శారీరక..మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. అందుకే, పిల్లల లంచ్ బాక్స్‌లో సరైన ఆహారం పెట్టడం తల్లిదండ్రుల బాధ్యతగా మారింది.

చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు ఇష్టంగా తినే ఇన్‌స్టంట్ నూడుల్స్ లాంటి ఆహారాన్ని లంచ్ బాక్స్‌లో పెడుతుంటారు. ఇవి త్వరగా తయారవుతాయి, పిల్లలు తినడానికీ ఇష్టపడతారు. కానీ, ఇవి ఆరోగ్యానికి ఏమాత్రం మంచివి కావు. ఎందుకంటే, ఇన్‌స్టంట్ నూడుల్స్ ప్రాసెస్ చేసిన పిండితో తయారవుతాయి.

వీటిలో ఎక్కువగా కెమికల్స్, ఉప్పు, కృత్రిమ రుచులు ఉంటాయి. ఇవి పిల్లల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపించవచ్చు. ఉదయం తయారు చేసిన నూడుల్స్ మధ్యాహ్నం వరకూ తాజాగా ఉండవు, దాంతో పిల్లలు తినకుండా వదిలేయవచ్చు లేదా తిన్నా జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి, వీటి బదులుగా ఇంట్లో స్వచ్ఛంగా తయారు చేసిన పోషకాహారాన్ని ఇవ్వడం ఉత్తమం.

అలాగే, పిల్లలకు వేయించిన స్నాక్స్ ఇవ్వడం కూడా మంచిది కాదు. పిల్లలు సమోసా, చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి వాటిని చాలా ఇష్టంగా తింటారు. కానీ ఇవి ఎక్కువ నూనెతో తయారవుతాయి, అధిక కొవ్వును కలిగి ఉంటాయి. ఇవి పిల్లల బరువు పెరగడానికి కారణమవుతాయి. క్రమంగా జీర్ణ సమస్యలు, లివర్‌కు సంబంధిత సమస్యలు కూడా రావచ్చు. అందుకే, వేయించిన ఆహారం కాకుండా ఆరోగ్యకరమైన ఆహారాన్ని వారికి ఇవ్వాలి.

కొంతమంది ఆరోగ్యకరమైన అలవాటు అనే ఉద్దేశంతో పచ్చి కూరగాయలను ఎక్కువగా పిల్లలకు లంచ్ బాక్స్ లో పంపుతారు. అయితే ఇటువంటి రా వెజిటేబుల్స్ పిల్లలకు పెద్దగా సెట్ కావు. పిల్లలకు ఎప్పుడు కూడా స్టీమ్ చేసిన వెజిటేబుల్స్ ని పెట్టడమే మంచిది. లేకపోతే వారి జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. మనం తినే వెజిటేబుల్స్ అలర్ట్ పిల్లలకు జీర్ణం అవ్వదు. కాబట్టి లంచ్ బాక్స్ లో ఎక్కువగా వెజిటేబుల్స్ అలౌడ్స్ కూడా పంపకూడదు.

పిల్లలు తీపి తినడాన్ని చాలా ఇష్టపడతారు. కానీ, అధిక చక్కెర ఉండే ఆహార పదార్థాలను వారికిచ్చినా ఆరోగ్యానికి హానికరమే. చాక్లెట్, క్యాండీ, కుకీస్, బేకరీ ఐటమ్స్ లాంటివి ఎక్కువగా తింటే, పిల్లల్లో క్యావిటీలు, ఒబేసిటీ వంటి సమస్యలు రావచ్చు.

బేకరీ పదార్థాల్లో కృత్రిమ రంగులు, అధిక చక్కెర ఉంటాయి, ఇవి ఆరోగ్యానికి మంచివి కావు. తీపి పదార్థాల బదులుగా, పిల్లలకు తాజా పండ్లు, తక్కువ చక్కెరతో చేసిన హోం మేడ్ ఆహారం ఇవ్వడం ఉత్తమం.

పిల్లలకు ప్యాక్ చేసిన ఆహారం, క్యాన్ డ్రింక్స్ కూడా మంచివి కావు. పిల్లలు బిస్కెట్లు, చిప్స్, బేకరీ పదార్థాలు తినాలనుకుంటారు. కానీ, ఇవి నెమ్మదిగా ఆరోగ్యాన్ని దెబ్బతీయగల హానికరమైన పదార్థాలతో తయారవుతాయి. వీటిలో పామాయిల్, అధిక ఉప్పు, కృత్రిమ రంగులు, ప్రిజర్వేటివ్‌లు ఉంటాయి.

ఇవి పిల్లల ఆరోగ్యంపై మెల్లగా ప్రభావం చూపుతాయి. అదే విధంగా, క్యాన్‌లలో వచ్చే కూల్ డ్రింక్స్, ప్యాక్ చేసిన జ్యూస్‌లు కూడా పిల్లల ఆరోగ్యానికి మంచివి కావు. వీటిలో అధిక చక్కెర మరియు ప్రిజర్వేటివ్‌లు ఉంటాయి, ఇవి పిల్లలకు గ్యాస్ట్రిక్ సమస్యలు, జీర్ణ సమస్యలు కలిగించవచ్చు.

కాబట్టి, పిల్లల ఆరోగ్యాన్ని కాపాడటానికి, లంచ్ బాక్స్‌లో సరైన ఆహారాన్ని పెట్టాలి. ఇంట్లో తయారు చేసిన ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు, తాజా పండ్లు, మెత్తగా ఉండే చిరుధాన్య లడ్డూలు, శరీరానికి శక్తిని ఇచ్చే పొట్టుగల ఆహారాన్ని ఇవ్వాలి. ఆరోగ్యకరమైన ఆహారం పిల్లల అభివృద్ధికి, శక్తికి తోడ్పడుతుంది. పిల్లల భవిష్యత్తును ఆరోగ్యంగా తీర్చిదిద్దే బాధ్యత తల్లిదండ్రులదే.

This post was last modified on February 3, 2025 11:05 am

Share
Show comments
Published by
Kumar
Tags: KidsSnacks

Recent Posts

21 ప‌ద‌వులు.. 60 వేల ద‌రఖాస్తులు..

కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాటులో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన అనేక మందికి స‌ర్కారు ఏర్ప‌డిన త‌ర్వాత‌.. నామినేటెడ్ ప‌ద‌వుల‌తో సంతృప్తి క‌లిగిస్తున్నారు. ఎన్ని…

6 hours ago

జగన్ కు సాయిరెడ్డి తలనొప్పి మొదలైనట్టే!

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇప్పుడు వరుసగా కష్టాలు మొదలైపోతున్నాయి. మొన్నటి సార్వత్రిక…

7 hours ago

వైసీపీకి భారీ దెబ్బ‌.. ‘గుంటూరు’ పాయే!

ఏపీ ప్ర‌తిప‌క్ష పార్టీ(ప్ర‌ధాన కాదు) వైసీపీకి తాజాగా భారీ ఎదురు దెబ్బ త‌గిలింది. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో 2021లో అతి…

8 hours ago

కిరణ్ అబ్బవరం… తెలివే తెలివి

కిరణ్ అబ్బవరం ఫ్లాప్ స్ట్రీక్‌కు బ్రేక్ వేసిన సినిమా.. క. గత ఏడాది దీపావళికి విడుదలైన ఈ చిత్రం సూపర్…

9 hours ago

తోలు తీస్తా: సోష‌ల్ మీడియాకు రేవంత్ వార్నింగ్‌

సోష‌ల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెట్టే సంస్కృతి పెరిగిపోతోంద‌ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇలాంటి వారి విష‌యంలో…

9 hours ago

పవన్ క్లారిటీతో వివాదం సద్దుమణిగినట్టేనా?

త్రిభాషా విధానాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రచ్చ రాజుకున్న సంగతి తెలిసిందే. జనసేన…

10 hours ago