ప్రపంచాన్ని వణికించిన వైరస్‌ల గురించి చెప్పుకోగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది కోవిడ్-19 (కరోనా వైరస్). అయితే, కరోనా ముందు కూడా ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేసిన వైరస్‌లు అనేకం ఉన్నాయి. వీటి ప్రభావం వల్ల ప్రతీ ఏటా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు అలాంటి పది వైరస్‌ల గురించి తెలుసుకుందాం.
1. రోటా వైరస్
శిశువులు, చిన్న పిల్లలలో అతిసార వ్యాధి కలిగించే రోటా వైరస్‌ను చైల్డ్ కిల్లర్ వైరస్ అని పిలుస్తారు. ప్రపంచంలోని దాదాపు ప్రతి బిడ్డ ఐదేళ్లలోపు కనీసం ఒక్కసారైనా ఈ వైరస్ బారిన పడుతుందనేది వాస్తవం. దీని వల్ల ప్రతీ ఏటా ప్రపంచవ్యాప్తంగా 5 లక్షల మంది పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు.
2. చికెన్ ఫాక్స్ (మశూచి)
మశూచి లేదా చికెన్ ఫాక్స్ ఒక భయంకర అంటువ్యాధి. ఈ వ్యాధి కారణంగా గతంలో 30–50 కోట్ల మంది మరణించినట్లు నివేదికలు చెబుతున్నాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో ఈ వ్యాధి కనిపించడం చాలా అరుదు.
3. తట్టు (మీజిల్స్)
పిల్లల్లో ఎక్కువగా కనిపించే తట్టు వ్యాధి గత 150 ఏళ్లలో 20 కోట్ల ప్రాణాలను బలి తీసుకుంది. ఈ వ్యాధి తుంపర్ల ద్వారా వ్యాపిస్తుంది.
4. డెంగ్యూ వైరస్
ఈ వైరస్ ఏడిస్ ఈజైప్టె అనే దోమల ద్వారా వ్యాపిస్తుంది. ప్రతీ ఏటా దాదాపు 10 కోట్ల మంది ఈ వైరస్ బారిన పడుతుండగా, 20 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
5. ఎబోలా-మార్బర్గ్ వైరస్
ఎబోలా, మార్బర్గ్ వైరస్‌లు అత్యంత ప్రాణాంతకమైనవి. వీటి కారణంగా రక్తస్రావం, అవయవ వైఫల్యాలు సంభవిస్తాయి. మరణాలు 90% వరకు ఉంటాయి.
7. ఎల్లో ఫీవర్
ఎల్లో ఫీవర్ సోకినవారి చర్మం పసుపు రంగులో మారుతుంది. ఈ వైరస్ కారణంగా 50% మంది రోగులు వారం రోజుల్లో మరణిస్తారు.
8. ఫ్లూ (ఇన్‌ఫ్లుఎంజా)
ఫ్లూ వైరస్ వల్ల ప్రతి ఏటా 5 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది పిల్లల్లో విరేచనాలు, వాంతులు కలిగిస్తుంది.
9. రేబిస్
కుక్క లేదా గబ్బిలం కాటుతో వ్యాపించే రేబిస్ జబ్బు మెదడుపై ప్రభావం చూపుతుంది. ఏటా 60 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
10. హెపటైటిస్ B, C
హెపటైటిస్ B వల్ల ప్రతి ఏటా 7 లక్షల మంది, హెపటైటిస్ C వల్ల 3.5 లక్షల మంది చనిపోతున్నారు. ఇవి ముఖ్యంగా కాలేయంపై ప్రభావం చూపిస్తాయి.
ఈ పైన చెప్పబడిన ఎన్నో వైరస్ల వ్యాప్తికి ముఖ్య కారణం పరిశుభ్రత లోపించడం. మరికొన్ని కొత్త వైరస్ లు కూడా భయపెడుతున్న నేపథ్యంలో మన పరిసరాల పారిశుభ్యంపై మనం శ్రద్ధ పెట్టడం ఎంతో అవసరం.
వీలైనంతగా బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, శానిటైజర్ లాంటివి వాడడం మంచిది. తేలికపాటి జాగ్రత్తలతో, ఆరోగ్యకరమైన జీవన శైలితో చాలావరకు మనం వైరస్లను అరికట్టవచ్చు.
This post was last modified on January 8, 2025 3:28 pm
ఈ నెల 10 శుక్రవారం నాడు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక సర్వదర్శన టోకెన్ల పంపిణీని…
ఏపీ మంత్రి, టీడీపీ యువ నేత నారా లోకేష్ తన ప్రసంగంలో ఏకంగా 21 సార్లు నమో అనే పదాన్ని…
విశాఖ బహిరంగ సభలో ప్రధాని మోదీని ఉద్దేశించి ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం మెచ్చే ఏకైక…
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఇతర కేంద్ర, రాష్ట్ర మంత్రులకు, రాష్ట్ర…
ఏపీ సీఎం చంద్రబాబు కలలు గంటున్న లక్ష్యాలను సాకారం చేసేందుకు తాము అండగా ఉంటామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ…
మొన్నటిదాకా అసలెవరో తెలియని ఇమాన్వి ఇస్మాయిల్ ప్రభాస్ సరసన హీరోయిన్ గా ఎంపిక కాగానే ఒక్కసారిగా ఇతర బాషల నిర్మాతల…