3లక్షలకు పైగా టిక్కెట్లు..పావుగంటంటే పావుగంటలోనే.. ప్రజలుఎగబడి.. మరీ.. వీటిని సొంతం చేసుకున్నారు. మరి ఇదేమన్నా.. జక్కన్న రాజమౌళి మూవీనా? లేక.. వచ్చే ఏడాది విడుదల కానున్న ఆర్ ఆర్ ఆర్ మూవీకి సంబంధించిన టిక్కెట్లా.. అంటే.. కానేకాదు! అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు టీటీడీ ప్రవేశ పెట్టిన సర్వదర్శనం టికెట్లు. కేవలం 15 నిముషాల్లో.. దేశవ్యాప్తంగా 3,10,000 మందికి పైగా.. సర్వ దర్శనం టికెట్లను సొంతం చేసుకున్నారు. ఇది.. ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను బద్దలుకొట్టిందని.. టీటీడీ వర్గాలు చెప్పాయి.
డిసెంబర్ నెలకు తిరుమల సర్వదర్శనం టికెట్లు.. ఆన్‌లైన్‌లో విడుదల చేసిన పది నిమిషాల్లోనే ఖాళీ అయ్యాయి. ఉదయం 9 గంటలకు తితిదే వెబ్‌సైట్‌లో డిసెంబర్ నెల సర్వదర్శనం కోటా టికెట్లు అందు బాటులో ఉంచారు. రోజుకు పది వేల టికెట్ల చొప్పున 3 లక్షలా 90 వేల టికెట్లను 15 నిమిషాల వ్యవధిలోనే భక్తులు బుక్ చేసుకున్నారు. వోటీపీ, వర్చువల్ క్యూ పద్ధతిలో టికెట్లు కేటాయించడంతో.. ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తలేదు. అలాగే రేపు ఉదయం 9 గంటలకు తిరుమలలో వసతికి సంబంధించిన టోకెన్లు కూడా విడుదల చేస్తామన్నారు.
తిరుమల టీటీడీ విడుదల చేసిన 3,10,000 శ్రీవారి సర్వదర్శనం టిక్కెట్లు కేవలం 16 నిమిషాల వ్యవధిలో నే బుక్ అయ్యి చరిత్ర సృష్టించాయి. టిటిడి ఐటీ విభాగం మరియు జియో ప్లాట్ ఫార్మ్స్ లిమిటెడ్ మధ్య ఎంవోయూ కుదిర్చి క్లౌడ్ టెక్నాలజీని ద్వారా ప్రారంభించిన ఆన్లైన్ బుకింగ్ మంచి ఫలితాన్ని ఇవ్వడంపై శ్రీవారి భక్తుల నుంచి మంచి ప్రశంసలు వస్తున్నాయి. ఈ రోజు విడుదల చేసిన 3,10,000 సర్వ దర్శనం టికెట్లు కేవలం 16 నిమిషాల్లోనే బుక్ అవ్వడంతో మున్ముందు.. మరిన్ని సాంకేతిక మాధ్యమాలను వినియోగించుకునే దిశగా టీటీడీ అడుగులు వేస్తుండడం గమనార్హం.
This post was last modified on November 27, 2021 2:10 pm
ముప్పై నాలుగు సంవత్సరాల తర్వాత ఈ రోజు విడుదలవుతున్న ఆదిత్య 369 సరికొత్త హంగులతో థియేటర్లలో అడుగు పెట్టేసింది. ప్రమోషన్ల…
ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని రాష్ట్ర పాలనా యంత్రాంగానికి కీలక కేంద్రం అయిన సచివాలయంలో శుక్రవారం ఉదయం అగ్ని ప్రమాదం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొత్త తరహా రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటిదాకా రాజకీయ నాయకులంటే……
కోర్ట్ రూపంలో ఇటీవలే బ్లాక్ బస్టర్ చవి చూసిన ప్రియదర్శి నెల తిరగడం ఆలస్యం ఏప్రిల్ 18న సారంగపాణి జాతకంతో…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య, తదనంతరం…
దేశవ్యాప్తంగా చాలా కాలంగా చర్చనీయాంశంగా మారిన వక్ఫ్ సవరణ బిల్లుకు పార్లమెంటులో ఆమోద ముద్ర పడి పోయింది. పార్లమెంటులోని దిగువ…