దశాబ్దం కిందటే టాలీవుడ్లో తరుణ్ ప్రస్థానం దాదాపుగా ముగిసిపోయింది. ‘నువ్వే కావాలి’ లాంటి ఆల్ టైం మెగా హిట్ సినిమాతో హీరోగా పరిచయమై.. ఆ తర్వాత ‘నువ్వు లేక నేను లేను’.. ‘ప్రియమైన నీకు’ లాంటి సూపర్ హిట్లు కొట్టి ఒక టైంలో పెద్ద స్టార్ అయ్యేలా కనిపించిన తరుణ్.. ఆ తర్వాత వరుస ఫ్లాపులతో బాగా వెనుకబడిపోయాడు.
ఒక దశలో అతడి సినిమా వస్తే జనాలు పట్టించుకోని పరిస్థితి వచ్చేసింది. చివరికి సినిమాలు మానేసి వ్యాపారాల్లో బిజీ అయిపోయాడు ఒకప్పటి లవర్ బాయ్. ఐతే చాలా ఏళ్ల విరామం తర్వాత అతను ‘ఇది నా లవ్ స్టోరీ’ అనే సినిమా చేశాడు. రెండేళ్లకు పైగా నిర్మాణంలో ఉన్న ఈ చిత్రం చాలా గ్యాప్ తర్వాత ఈ మధ్యే మళ్లీ వార్తల్లోకి వచ్చింది.
ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 14న రిలీజ్ చేయబోతున్నట్లు కొన్ని రోజుల ముందు తరుణ్ ప్రకటిస్తే.. జనాలు పెద్దగా పట్టించుకోలేదు. ఈ సినిమా నిజంగానే ఆ తేదీకి రిలీజవుతుందన్న నమ్మకాలు చాలామందికి కలగలేదు. ఐతే తరుణ్ మాత్రం తన పాటికి తాను సినిమాను ప్రమోట్ చేసుకుంటూ పోయాడు. ఇప్పుడు నిజంగానే ప్రేమికుల దినోత్సవాన సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు పూర్తి చేశాడు.
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ చిత్రాన్ని అమెరికాలో 60 లొకేషన్లలో రిలీజ్ చేయబోతున్నారట. ఒక రోజు ముందే అన్ని చోట్లా ప్రిమియర్లు కూడా వేస్తారట. తరుణ్ ఫాంలో ఉన్న సమయంలో అసలు తెలుగు సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్ అన్నదే లేదు. ఇప్పటిదాకా తరుణ్ నటించిన ఏ సినిమా అమెరికాలో రిలీజవ్వలేదు. తెలుగు రాష్ట్రాల్లోనే అతడి మార్కెట్ బాగా దెబ్బ తినేసింది.
ఇక్కడ సినిమా రిలీజవ్వడమే కష్టం అనుకుంటుంటే.. ఇలా పెద్ద స్థాయిలో ఓవర్సీస్ రిలీజ్ ఎలా సాధ్యం అన్నదే అర్థం కావడం లేదు. మరి తరుణ్ ఏం మ్యాజిక్ చేశాడో ఏంటో? మరి ఈ లవ్ స్టోరీ అక్కడి జనాల్ని ఆకట్టుకుని.. మంచి టాక్ తెచ్చుకుని.. తెలుగు రాష్ట్రాల్లోనూ బాగా ఆడి.. తరుణ్‌కు మళ్లీ ఒక సక్సెస్ అందిస్తుందేమో చూద్దాం.
తరుణ్ సినిమాకు అంత పెద్ద రిలీజా?
Feb 13, 2018
126 Shares
రాజకీయ వార్తలు
-
కేసీఆర్‌కు తలనొప్పిగా పార్టీ నేతల అక్రమాలు
Apr 21,2018
126 Shares
-
శ్రీరెడ్డిపై భారీ బాంబు పేల్చిన కల్యాణి
Apr 21,2018
126 Shares
-
పవన్ ఓ విధంగా దెబ్బేసినట్లే
Apr 21,2018
126 Shares
-
నరేంద్రమోడీ, నీరవ్, లలిత్ లండన్‌లో ఏం చేస్తున్నారో చెప్తున్న కేఈ
Apr 21,2018
126 Shares
-
మోడీకి ఆమె సూచన ఇచ్చిందా...అవమానించిందా?
Apr 20,2018
126 Shares
-
బాబు మోసం చేయలేదు... వెంకయ్య రాంగ్ !
Apr 20,2018
126 Shares
సినిమా వార్తలు
-
మహేష్ స్టామినా తగ్గినట్లుందే..
Apr 21,2018
126 Shares
-
పిక్ టాక్: స్ప్రింగులాంటి దిశా
Apr 21,2018
126 Shares
-
సూపర్ స్టార్ ప్లేసులో సాయిపల్లవి
Apr 21,2018
126 Shares
-
మెగా హీరోల కోసం పొలిటికల్ స్ర్కిప్ట్
Apr 21,2018
126 Shares
-
నాన్-బాహుబలి రికార్డుల్లో భరత్ కూడా..
Apr 21,2018
126 Shares
-
వరుణ్ సినిమా కూడా కాపీయేనట
Apr 21,2018
126 Shares