స్పై లేదా జై ఫ్లాపవడంపైనే ఈ జూదం!

స్పై లేదా జై ఫ్లాపవడంపైనే ఈ జూదం!

దసరా బరిలో మూడు సినిమాలున్న సంగతి తెలిసిందే. రెండు భారీ చిత్రాలతో పాటు ఒక చిన్న చిత్రం కూడా దసరాకి రిలీజ్‌ అవుతోంది. సంక్రాంతికి ఇన్ని సినిమాలు రావడం మామూలే కానీ దసరాకి మామూలుగా ఇంత రద్దీ వుండదు. దసరా బరిలో ఇన్ని చిత్రాలు వుండడం కరక్ట్‌ కాదని, దీని వల్ల నష్టం వుంటుందని ట్రేడ్‌ గురించి బాగా తెలిసిన వారు చెబుతున్నారు.

జై లవకుశ, స్పైడర్‌ రెండూ కనుక హిట్‌ టాక్‌ తెచ్చుకున్నట్టయితే వీటి తర్వాత రిలీజ్‌ అయ్యే మహానుభావుడుకి ఇబ్బంది ఎదురవుతుంది. ఈ రెండిట్లో ఒక సినిమా అంచనాలు అందుకోకపోయినా కానీ 'మహానుభావుడు'కి ఛాన్స్‌లు పెరుగుతాయి. పూర్తిగా వేరే సినిమా జయాపజయాల మీద డిపెండ్‌ అవుతూ యువి క్రియేషన్స్‌ వాళ్లు పెద్ద గ్యాంబులే ఆడుతున్నారు.

ఆ రెండు సినిమాల్లో ఒకటి మిస్‌ఫైర్‌ అయితే దసరా ముందు రోజున విడుదలయ్యే మహానుభావుడికి చాలా ప్లస్‌ అవుతుంది. దసరా సెలవుతో పాటు గాంధీ జయంతి హాలిడే కూడా మొదటి వారాంతంలో కలిసి వస్తుంది కనుక వసూళ్లకి ఢోకా వుండదు. అదే మహేష్‌, ఎన్టీఆర్‌ ఇద్దరి చిత్రాలూ పెద్ద హిట్‌ అయితే శర్వానంద్‌ సినిమాకి ఎంతమంది వస్తారనేది చిత్రమైన పరిస్థితే. మారుతికి వున్న బ్రాండ్‌ వేల్యూ, శర్వానంద్‌కి వున్న ఫ్యామిలీ అప్పీల్‌, నిర్మాతలకి వున్న గుడ్‌విల్‌ కలిసి వస్తాయనేది వారి అంచనా. ఇక ఫలితం ప్రేక్షకుల చేతుల్లో వుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు