ప్రియాంకపై కాంగ్రెస్ లో కుట్ర ?!

రాయ్ బరేలీ నుండి పోటీకి దిగుతుంది అనుకున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కుమార్తె ప్రియాంకా గాంధీ ఎందుకు పోటీ చేయలేదు ? అక్కడి నుండి ఆమె పోటీ చేస్తారని ఊహాగానాలు వెలువడినా అమె ఎందుకు బరిలోకి దిగలేదు ? ప్రియాంక స్థానంలో రాహుల్ ఎందుకు పోటీకి దిగాడు ? అంటే దీని వెనక కుట్ర ఉంది అంటున్నాడు కాంగ్రెస్ బహిష్కృత నేత ఆచార్య ప్రమోద్‌ కృష్ణమ్.

ఈ మేరకు ఆయన సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రియాంక గాంధీపై పార్టీలో కుట్ర జరుగుతోందని, కాంగ్రెస్ పార్టీ త్వరలో చీలి పోతుందని, రాహుల్ గాంధీ వర్గం, ప్రియాంక గాంధీ వర్గాలుగా చీలిపోవడం ఖాయమని అంటున్నారు.

రాహుల్‌ గాంధీ అమేథీ నియోజకవర్గాన్ని వీడిన తీరు కాంగ్రెస్‌ కార్యకర్తల మనోధైర్యం దెబ్బతీసిందని, ప్రియాంక గాంధీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో జూన్‌ 4 తర్వాత ఆమె మద్దతుదారుల గుండెల్లో ఆవేదన అగ్నిపర్వతంలా బద్దలవ్వడం ఖాయమని ఆచార్య ప్రమోద్ కృష్ణమ్ అన్నారు.

ప్రియాంక గాంధీని రాహుల్ గాంధీ ఎన్నికల్లో పోటీ చేయనివ్వరని నేను ముందే చెప్పానని, ప్రియాంక గాంధీపై కుటుంబంలో, పార్టీలో భారీ కుట్ర జరుగుతోందని ఆయన అంటున్నారు.

రాహుల్ గాంధీకి పాకిస్థాన్‌లో ప్రజాదరణ బాగుందని, ఆయన రాయ్‌బరేలీకి బదులుగా పాక్‌లోని రావల్పిండి నుంచి పోటీ చేస్తే బావుంటుందని ఎద్దేవా చేశాడు.