ఏపీలో ఫ‌స్ట్ నామిషేన్ ఆయ‌న‌దే!

ఏపీలో అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు సంబంధించిన నామినేష‌న్ల ప‌ర్వం ప్రారంభ‌మైంది. గురువారం ఉద‌యం ప్రారంభ‌మైన ఈ నామినేష‌న్ల సంద‌డి.. ఈ నెల 25వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. అయితే.. రాష్ట్రంలోతొలి రోజే నామినేష‌న్లు వేసేందుకు చాలా మంది నాయ‌కులు రెడీ అయ్యారు. వారం ప‌రంగా గురువారం రావ‌డం.. తిథి ప‌రంగా ద‌శ‌మికావ‌డంతో నాయ‌కులు.. ఎక్కువ మంది ఉత్సాహంగా ముందుకు క‌దిలారు. వీరిలో చాలా మంది పార్టీల కీల‌క నాయ‌కులే ఉండ‌డం గ‌మ‌నార్హం.

అయితే.. తొలి అసెంబ్లీ నామినేష‌న్ మాత్రం.. టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే, అనంత‌పు రం జిల్లా ఉర‌వ‌కొండ నియోజ‌క‌వ‌ర్గంలో మ‌రోసారి అదృష్టం ప‌రిశీలించుకుంటున్న ప‌య్యావుల కేశ‌వ్‌ది కావ‌డం గ‌మ‌నార్హం. ఈయ‌న త‌ర్వాత‌.. ప‌లువురు నామినేష‌న్లు దాఖ‌లు చేశారం.. మ‌ధ్యాహ్నం 1 గంట స‌మ‌యానికి దాదాపు 40 మంది నామినేష‌న్లు దాఖ‌లు చేశారు. వీరిలో స‌మాజ్‌వాదీ పార్టీ నేత(ద‌ర్శి) ఉండడం విశేషం.

ఇక‌, పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు సంబంధించి కూడా.. ప‌లువురు నామినేష‌న్లు దాఖ‌లు చేశారు. తొలి నామినే షన్ క‌డ‌ప పార్ల‌మెంటు టీడీపీ అభ్య‌ర్థి.. చ‌దిపిరాళ్ల భూపేష్ కావ‌డం గ‌మ‌నార్హం. త‌ర్వాత స్థానంలో యుగ‌తుల‌సి పార్టీ(వైటీపీ) కి చెందిన శంభాన శ్రీనివాస‌రావు ఉన్నారు. ఈయ‌న విజ‌యన‌గ‌రం పార్ల‌మెంటు స్థానం నుంచి రెండు సెట్ల నామినేష‌న్ ప‌త్రాల‌ను దాఖ‌లు చేశారు. అదేవిధంగా విశాఖ ప‌ట్నం పార్ల‌మెంటు స్థానానికి ఇండిపెండెంటుగా.. వ‌డ్డి హ‌రిగ‌ణేష్ నామినేష‌న్ వేశారు. మొత్తంగా చూస్తే.. తొలిరోజు మంచిదని భావించిన నాయ‌కులు చాలా త్వ‌ర‌త్వ‌ర‌గానే ప‌నికానిచ్చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.