ప్రభాస్ కొత్త సినిమాల అప్ డేట్ల, రిలీజ్ కోసం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూడటం బాగా అలవాటైపోయింది అభిమానులకు. ‘బాహుబలి’ దగ్గర్నుంచి ఈ ఒరవడి కొనసాగుతోంది. ఆ సినిమా మొదలైన దగ్గర్నుంచి ఏదో ఒక దశలో ఆలస్యం జరుగుతూనే వచ్చింది. ఆ తర్వాత ‘సాహో’ విషయంలోనూ అలాగే జరిగింది. ఇప్పుడు ‘రాధేశ్యామ్’ కూడా అందుకు భిన్నమేమీ కాదు. ఈ సినిమా అనివార్య కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది.
సినిమా లేటవడం ఒక బాధ అయితే.. అభిమానులు కోరుకునే అప్‌డేట్లను చిత్ర బృందం ఎప్పటికప్పుడు అందించకపోవడం మరో బాధ. ‘సాహో’ విషయంలో యువి క్రియేషన్స్ నిర్లక్ష్య ధోరణిపై అప్పట్లో ప్రభాస్ అభిమానులు ఎంత గొడవ చేశారో తెలిసిందే. నిర్మాణ సంస్థ ఆఫీసుకు వెళ్లి ఆందోళన చేపట్టే వరకు పరిస్థితి వెళ్లింది. ‘రాధేశ్యామ్’ విషయంలోనూ తమను ఇలాగే ఏడిపిస్తున్నారంటూ అభిమానులు యువి క్రియేషన్స్‌పై మండిపడుతున్నారు.
‘రాధేశ్యామ్’ పట్టాలెక్కి ఏడాది దాటిపోగా ఇప్పటిదాకా కొన్ని పోస్టర్లు రిలీజ్ చేశారు తప్ప ఏ విశేషాలూ బయట పెట్టలేదు. మొన్న నూతన సంవత్సరాదికి టీజర్ ఏమైనా వస్తుందేమో అని ఆశిస్తే.. ప్రభాస్‌ది ఒక మామూలు లుక్ రిలీజ్ చేసి సరిపెట్టారు. టీజర్ అప్ డేట్ గురించి సోషల్ మీడియాలో ఎన్ని డిమాండ్లు చేసినా పట్టించుకోవట్లేదు. దీంతో మళ్లీ సోషల్ మీడియాలో ఉద్యమం మొదలుపెట్టారు ప్రభాస్ ఫ్యాన్స్.
ఐతే నిర్మాణ సంస్థ స్పందించలేదు కానీ.. దర్శకుడు రాధాకృష్ణకుమార్‌కు విషయం తీవ్రత అర్థమై లైన్లోకి వచ్చాడు. ప్రభాస్ అభిమానులు కాస్త ఓపిక పట్టాలని.. టీజర్ అప్‌డేట్ సిద్ధమవుతోందని.. అభిమానుల ఆకాంక్షలకు ఏమాత్రం తగ్గని విధంగా టీజర్ ఉంటుందని ట్వీట్ చేశాడు. దీంతో ప్రభాస్ అభిమానులు కాస్త చల్లబడ్డారు. రాధాకృష్ణకుమార్ మాటల్ని బట్టి చూస్తే సంక్రాంతికి టీజర్ ఏమైనా వస్తుందేమో అన్న ఆశ వారిలో మొదలైంది. కాగా ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ చిత్రీకరణ చివరి దశలో ఉంది. హైదరాబాద్‌లోని ప్రఖ్యాత ఫలక్ నుమా ప్యాలెస్‌లో ఈ సినిమా కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుండటం విశేషం. ఈ చిత్రం వేసవిలో విడుదలయ్యే అవకాశాలున్నాయి.
This post was last modified on January 5, 2021 2:26 pm
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…