తెలుగు సినీ ప్రపంచాన్నే కాకుండా.. హాలీవుడ్ సినీ రంగాన్నికూడా కుదిపేసిన పాట ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాలోని ‘నాటు.. నాటు’ సాంగ్. దీనికి ఆస్కార్ పురస్కారం కూడా దక్కిన విషయం తెలిసిందే. అయితే.. ఇప్పటి వరకు దీనిని ఎన్నికల ప్రచారంలో వాడుకోవచ్చని.. మన వాళ్లు గుర్తించలేక పోయారు. లేకపోతే.. ఈఏడాది వచ్చిన ఎన్నికల్లో ఈ పాట మార్మోగిపోయి ఉండేది. కానీ… ఈ ఐడియా.. అమెరికన్లకు తట్టింది. ముఖ్యంగా భారతీయ మూలాలున్న కమలా హ్యారిస్ బృందానికి నాటు-నాటు పాటను రాజకీయంగా ఎన్ని కల్లో వాడుకోవాలన్న ఆలచన వచ్చింది.
వెంటనే దీనిని అమలు చేశారు కూడా. ఈ ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హ్యారిస్ తలపడుతున్న విషయం తెలిసిందే. దీంతో ఆమెకు ప్రచారం చేసేందుకు పెద్ద ఎత్తున భారతీయ అమెరికన్లు రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే నాటు నాటు పాటను వాడుకుంటున్నారు. అయితే… యథాతథంగా తెలుగులో కాకుండా.. నాటు-నాటు పాటను హిందీలో నాచో.. నాచో.. గీతంగా వాడుకున్నారు. ప్రస్తుతం ఇది ఎన్నికల ప్రచారంలో జోరుగా వినిపిస్తోంది. కొందరు రింగ్ టోన్‌గా కూడా పెట్టుకున్నారు.
దీనిని హ్యారిస్ బృందంలోని భారత-అమెరికన్ నాయకుడు అజయ్ భుటోరియా విడుదల చేశారు. ‘నాచో నాచో’ కేవలం పాట కాదని, అదొక పెద్ద ఉద్యమమని ఆయన తెలిపారు. దక్షిణాసియా అమెరికన్ కమ్యూనిటీతో అనుసంధానం కావడమే ఈ పాటను ప్రచారంలోకి తీసుకురావడం వెనుక ఉన్న లక్ష్యమని పేర్కొన్నారు. తాజా ఎన్నికల్లో 44 లక్షల మంది ఇండియన్ అమెరికన్ ఓటర్లు, 60 లక్షల మంది దక్షిణాసియా ఓటర్లు ఓటేయనున్నారని.. వారిని ఆకర్షించేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నట్టు వివరించారు.
This post was last modified on September 10, 2024 9:55 am
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…