Trends

నెట్‌ఫ్లిక్స్ దుమారం.. ఏం జ‌రిగింది?

ప్ర‌పంచ వ్యాప్త‌తంగా ‘నెట్ ఫ్లిక్‌’ అంటే తెలియ‌ని ప‌ట్ట‌ణ ప్ర‌జ‌లు ఉండ‌రు. ఒక‌ప్పుడు ఇది ఖ‌రీదైనా.. ఇప్పుడు నేరుగా ఇంట్లోకి వ‌చ్చేసింది. తక్కువ ప్రీమియంలతో ఎక్కువ వినోదం అందిస్తున్న ఓటీటీ ప్లాట్ ఫాంగా గుర్తింపు పొందింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ.. నెట్‌ఫ్లిక్స్ వినియోగ‌దారుల సంఖ్య 60 శాతానికి పైగానే ఉంది. కొత్త కొత్త సినిమాల‌తోపాటు వెబ్ సిరీస్ ద్వారా వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకోవ‌డంలో నెట్ ఫ్లిక్స్ ముందుంది. అయితే.. ఇప్పుడు ఈ మాధ్య‌మం తీవ్ర దుమారానికి కార‌ణ‌మైంది.

అమెరికా నుంచి కార్య‌క‌లాపాలు నిర్వ‌హించే నెట్ ఫ్లిక్స్ సంస్థ‌పై అక్క‌డి రిప‌బ్లిక‌న్ అభ్య‌ర్థి, మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ వ‌ర్గం నిప్పులు చెరుగుతోంది. ‘క్యాన్సిల్ నెట్ ఫ్లిక్స్’ హ్యాష్ ట్యాగ్‌తో నెట్‌ఫ్లిక్స్‌ను త‌క్ష‌ణ‌మే వ‌దులుకోవాల‌న్న పిలుపు జోరుగా వినిపిస్తోంది. దీంతో కేవ‌లం 24 గంట‌ల్లోనే వేల కొద్దీ వినియోగ‌దారులు నెట్‌ఫ్లిక్స్ స‌బ్‌స్క్రిప్ష‌న్‌ను వ‌దులుకున్నారు. ఇప్పుడు ఈ ప‌రిణామం.. ప్ర‌పంచ వ్యాప్తంగా పాకింది. భార‌త్లోనూ ట్రంప్‌కు మ‌ద్ద‌తిచ్చే వారు.. నెట్‌ఫ్లిక్స్‌ను వదులుకోవాల‌ని.. ఆన్‌లైన్ వేదిక‌గా పెద్ద ఉద్య‌మ‌మే సాగుతోంది.

కార‌ణం ఏంటి?

ఈ ఏడాది అగ్ర‌రాజ్యం అమెరికాలో అధ్య‌క్ష ఎన్నికలు జ‌ర‌గ‌నున్నాయి. ఈ క్ర‌మంలో ఆ దేశం దాదాపు రెండుగా చీలిపోయింది. వ్యాపార వ‌ర్గాల నుంచి ఉద్యోగుల వ‌ర‌కు కూడా.. డెమొక్రాట్ అభ్య‌ర్థిగా ఉన్న క‌మ‌లా హ్యారిస్‌కు మ‌ద్ద‌తిస్తున్నారు. మ‌రికొన్ని వ‌ర్గాలు రిప‌బ్లిక‌న్ అభ్య‌ర్థి ట్రంప్‌కు మ‌ద్ద‌తిస్తున్నారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ట్రంప్ దూకుడుగా ముందుకు సాగారు. మ‌ద్ద‌తు కూడా పెరిగింది. ఇక‌, డెమొక్రాట్ల విష‌యంలో ప్ర‌స్తుత అధ్య‌క్షుడు బైడెన్ పోటీ నుంచి త‌ప్పుకొన్నాక‌.. ఆ పార్టీ పుంజుకుంది.

ఈ క్ర‌మంలోనే విరాళాలు కూడా వ‌స్తున్నాయి. ఇలా.. నెట్‌ఫ్లిక్స్ సంస్థ కూడా.. 7 మిలియ‌న్ డాల‌ర్ల(7 కోట్ల డాల‌ర్లు. భారత క‌రెన్సీలో 560 కోట్లు) క‌మ‌లా హ్యారిస్‌కు విరాళం ఇచ్చింది. అంతే.. ఈ ప‌రిణామం ట్రంప్ శిబిరంలో క‌ల‌క‌లం రేపింది. ఇంత భారీ మొత్తం క‌మ‌ల‌కు రావ‌డంతో నెట్ ప్లిక్స్‌పై నిప్పులు చెరుగుతు న్నారు. ఈ క్ర‌మంలోనే నెట్‌ఫ్లిక్స్‌ను వ‌దులుకోవాలంటూ.. ఉద్య‌మం చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఆన్‌లైన్‌లో పెద్ద ఎత్తున ఈ విష‌య‌మే ట్రెండింగ్‌గా మార‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on July 27, 2024 3:39 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

స‌లార్-1పై నిరాశ‌.. స‌లార్-2పై భ‌రోసా

బాహుబ‌లి-2 త‌ర్వాత వ‌రుస‌గా మూడు డిజాస్ట‌ర్లు ఎదుర్కొన్న ప్ర‌భాస్‌కు స‌లార్ మూవీ గొప్ప ఉప‌శ‌మ‌నాన్నే అందించింది. వ‌ర‌ల్డ్ వైడ్ ఆ…

2 hours ago

సినీప్రముఖుల ఇళ్ళపై రాళ్ల‌దాడి.. సీఎం రేవంత్ రియాక్ష‌న్!

ఐకాన్ స్టార్‌.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొంద‌రు వ్య‌క్తులు దాడికి దిగిన విష‌యం తెలిసిందే. భారీ ఎత్తున…

3 hours ago

తాతకు త‌గ్గ‌ మ‌న‌వ‌డు.. నారా దేవాన్ష్ `రికార్డ్‌`

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌న‌వ‌డు, మంత్రి నారా లోకేష్‌, బ్రాహ్మ‌ణి దంప‌తుల కుమారుడు నారా దేవాన్ష్‌.. రికార్డు సృష్టించారు. ఇటీవ‌ల…

4 hours ago

అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి.. ఎవరి పని?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో కొంద‌రు ఆందోళ‌న కారుల‌ను పోలీసులు అరెస్టు…

7 hours ago

అల్లు అర్జున్‌కు షాక్‌.. వీడియో బ‌య‌ట పెట్టిన సీపీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మ‌రింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేట‌ర్ ఘ‌ట‌న‌పై ఇప్ప‌టికే ఏ11గా కేసు న‌మోదు…

7 hours ago

మీకు కావలసినవన్నీ గేమ్ ఛేంజర్ లో ఇరుక్కు : చరణ్!

తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…

7 hours ago