రెండేళ్లుగా సాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తాజాగా ఘోరం చోటు చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి ఒకరు ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన మహ్మద్ అఫ్సాన్ (30) అనే యువకుడు ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధంలో రష్యా తరఫున పోరాడుతూ ప్రాణాలు కోల్పోయినట్లు అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. అఫ్సాన్ మృతి విషయాన్ని అధికారులు బుధవారం వెల్లడించారు. అఫ్సన్ ను హెల్పర్ ఉద్యోగం కోసం ఏజెంట్లు హైదరాబాద్ నుంచి రష్యా తీసుకెళ్లారు.
అక్కడ ఉద్యోగం విషయంలో మోసపోవడంతో అఫ్సన్ రష్యన్ ఆర్మీలో బలవంతంగా చేరాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, రష్యా సైన్యానికి సహాయ సిబ్బందిగా పని చేస్తున్న దాదాపు 20 మంది భారతీయులను స్వదేశం తీసుకొచ్చేందుకు తాము ప్రయత్నిస్తున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపిన కొద్ది రోజులకే ఈ విషాదం వెలుగుచూసింది. మరోవైపు, అఫ్సాన్ ను హైదరాబాద్ తీసుకొచ్చేందుకు సాయం చేయాలని అతని కుటుంబం ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని సంప్రదించింది.
దీంతో ఆయన చొరవతో మాస్కోలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించగా.. అఫ్సాన్ చనిపోయినట్లు అక్కడి అధికారులు ధ్రువీకరించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అఫ్సాన్ మృతదేహాన్ని హైదరాబాద్ తీసుకు రావాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా, ఈ ఘటనపై పలువురు నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. ‘ఇది నిజంగా బాధాకరం. హైదరాబాద్ కు చెందిన మహ్మద్ అఫ్సాన్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. మోసపోయిన, విషాద పరిస్థితుల్లో చిక్కుకున్న తెలంగాణ యువకులను తిరిగి స్వస్థలాలకు చేరేలా సహాయం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా“ అని ట్వీట్ చేశారు.
This post was last modified on March 7, 2024 10:27 am
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…