అగ్రరాజ్యం అమెరికాలో ప్రవాస భారతీయుడి ఘరానా మోసం బయటకు వచ్చింది. ఒక ఫుట్ బాల్ జట్టుకు చూసే అతగాడు.. ఏకంగా రూ.183 కోట్ల మేర కొల్లగొట్టిన వైనం షాకింగ్ గా మారింది. అతగాడి పాపం పండింది. అతగాడి వైనం హాట్ టాపిక్ గా మారింది. భారత సంతతికి చెందిన ఈ కేటుగాడు చేసిన పనికి నోరెళ్లబెడుతున్నారు. విలాసాలకు అలవాటు పడిన ఇతడు చేసిన ఈ నేరంపై ఇప్పుడు సీరియస్ చర్యలు తప్పవంటున్నారు.
అమెరికాలో నివసించే భారత సంతతికి చెందిన అమిత్ పటేల్.. ఆ దేశానికి చెందిన ఫుట్ బాల్ టీమ్ జాక్సన్ విల్లే జాగ్వార్స్ కు ఎగ్జిక్యూటిగా పని చేస్తుండేవాడు. జట్టు పనులు చూసే క్రమంలో.. అతడి మీద భరోసాతో అతనికి పనులన్ని అప్పజెప్పారు. దీన్నిఅవకాశంగా తీసుకున్న అతడు.. జట్టుకు సంబంధించిన 22 మిలియన్ అమెరికన్ డాలర్ల మొత్తాన్ని కొల్లగొట్టేశాడు. మన రూపాయిల్లో చూస్తే.. దగ్గర దగ్గర రూ.183 కోట్ల వరకు ఉంటుంది.
ఈ డబ్బుతో ఫ్లోరిడాలోని లగ్జరీ ఇంటిని కొనుగోలు చేయటంతో పాటు ఖరీదైన టెస్లా కారు.. విలువైన వాచ్ లతో పాటు.. క్రిప్టో కరెన్సీని కొనుగోలు చేసినట్లుగా గుర్తించారు. అంతేకాదు.. విలాసాలకు మరిగి.. స్నేహితులతో కలిసి చార్టెడ్ ఫ్లైట్లలో విహార యాత్రలు చేసేవాడు. ఇతగాడి తప్పుడు పనులు బయటకు వచ్చాయి.
దీంతో స్పందించిన జాక్సన్ విల్లే యాజమాన్యం అతన్ని ఉద్యోగం నుంచి ఈ ఏడాది ఫిబ్రవరిలో తొలగించింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఫ్లోరిడాలోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టులో కేసు వేసింది. ప్రస్తుతం విచారణలో ఉన్న ఈ కేసుపై తీర్పుత్వరలో వస్తుందని.. శిక్ష తప్పదని చెబుతున్నారు.
This post was last modified on December 9, 2023 10:48 am
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. వైసీపీ హయాంలోనే రాష్ట్రంలో సంపద సృష్టి జరిగిందని చెప్పుకొచ్చారు.…
జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతి ప్రసాదం…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ సారథ్యంపై సొంత పార్టీలోనే లుకలుకలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి పార్టీ అధ్యక్షుడిగా రాహుల్…
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు ఆనంద పడుతున్నారా? సంతోషంగానేఉన్నారా? ఇదీ.. ఇప్పు డు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఉండి…
హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా పట్టువదలని విక్రమార్కుడిలా తన సినిమాలను తమిళంతో సమాంతరంగా తెలుగులోనూ విడుదల చేయిస్తున్న హీరో సిద్దార్థ్…