సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్న వేళ.. కీలక సూచన చేశారు కేంద్ర టెలికం శాఖా మంత్రి అశ్వినీ వైష్ణవ్. మొబైల్ ఫోన్లకు గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ ను అస్సలు ఎత్తొద్దని.. తెలిసిన నంబర్లకు మాత్రమే స్పందించాలని కోరారు. ఇటీవల కాలంలో టెలికం శాఖ తీసుకున్న చర్యలతో స్పామ్ కాల్స్.. సైబర్ మోసాలకు సంబంధించిన కేసులు తగ్గినట్లుగా చెప్పిన ఆయన తాను చేసిన సూచనను సీరియస్ గా తీసుకోవాలన్నారు.
“తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్ ను ఎప్పుడూ ఆన్సర్ చేయొద్దు. గుర్తించిన నంబర్ల నుంచి వచ్చిన కాల్స్ కే స్పందించాలి. ఈ విషయంలో ప్రతి ఒక్క పౌరుడికి విజ్ఞప్తి చేస్తున్నా. గుర్తు తెలియని నంబర్ నుంచి మెసేజ్ వచ్చినప్పుడు.. ఎవరి నుంచి ఆ మెసేజ్ వచ్చిందో నిర్దారించుకున్న తర్వాతే స్పందించాలి” అని ఆయన కోరారు.
దాదాపు 40 లక్షలకు పైగా తప్పుడు సిమ్ లు.. 41 వేల అక్రమ పాయింట్ ఆఫ్ సేల్ ఏజెంట్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టినట్లుగా చెప్పారు. ఇలాంటి కేసుల్ని గణనీయంగా తగ్గించటంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉయోగిస్తున్నట్లుగా చెప్పారు. సో.. ఫోన్లు వాడుతున్న వారంతా.. గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే కాల్స్ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. బీకేర్ ఫుల్.
This post was last modified on June 3, 2023 7:56 pm
దసరా తర్వాత నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ది ప్యారడైజ్ సినిమా మిశ్రమ స్పందన…
హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…
గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…
మంచి అందగాడు, పెర్ఫామెన్స్ విషయంలోనూ ఢోకా లేదు. అయినా నవదీప్ టాలీవుడ్లో అనుకున్నంత పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాడు. తేజ మూవీ…
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మంచి జోష్ లో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ థియేట్రికల్ రన్ లో సూపర్…
నిన్న కొత్త సినిమాలు చాలా రిలీజయ్యాయి. మాములుగా అయితే థియేటర్లు కిటకిటలాడిపోవాలి. అయితే ఆక్యుపెన్సీలు కొంచెం నెమ్మదిగా ఉన్న నేపథ్యంలో…