ఇటీవల వైసీపీకి సంబంధించి ఒక ఆసక్తికర సర్వే అంటూ..ప్రచారంలోకి వచ్చింది. ఒక జాతీయ మీడియా వచ్చే 2024 లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ 25 స్థానాలకు 24 చోట్ల గెలుస్తుందని పేర్కొంది. కానీ.. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే.. ఈ సర్వే ఎంత తప్పో చెప్పడానికి రెండు కీలక నియోజకవర్గాలు ఉదాహరణగా నిలిచాయి. ఉమ్మడి కృష్ణాలో రెండు ఎంపీ స్థానాలు విజయవాడ-మచిలీపట్నం ఉన్నాయి. 2014లో రెండు కూడా టీడీపీ దక్కించుకుంది. విజయవాడ, మచిలీపట్నం నియోజకవర్గాల్లో టీడీపీ జెండా రెపరెపలాడింది.
అయితే.. 2019కి వచ్చేసరికి.. మచిలీపట్నం వైసీపీ ఖాతాలో పడింది. విజయవాడ మళ్లీ టీడీపీకే దక్కింది. వైసీపీ విశ్వప్రయత్నం చేసినా ఫలించలేదు. అయితే.. ఈ దఫా 2024 ఎన్నికల్లో మాత్రం ఈ రెండు కూడా టీడీపీకే దక్కనున్నాయని అంటున్నారు పరిశీలకులు.
వచ్చే ఎన్నికల్లో మచిలీపట్నం ఎంపీగా ఉన్న వైసీపీ నాయకుడు బాలశౌరి ఇక్కడ నుంచి పోటీ చేస్తే.. ఓడించేందుకు సొంత పార్టీ నాయకులే రెడీగా ఉన్నారనేది కొన్నాళ్లుగా వినిపిస్తున్న వాదన. ఈ నేపథ్యంలో ఆయన నరసారావుపేటకు వెళ్లనున్నారని సమాచారం. దీంతో ఇక్కడ కొత్త వారికి అవకాశం ఇవ్వాలనేది ప్లాన్.
కానీ, ఎవరు వచ్చినా.. టీడీపీ నేత కొనకళ్ల నారాయణ ముందు నిలిచే పరిస్థితి కనిపించడం లేదు. ఇక విజయవాడలో ఇప్పటి వరకు వైసీపీ తరఫున పోటీ చేసే నాయకుడు తెరమీదికి రాలేదు. గత ఎన్నికల్లో పొట్లూరి వీరప్రసాద్(పీవీపీ ప్రసాద్) పోటీ చేసి ఓడిపోయారు. అయితే.. ఆయన మాత్రం తాను ఓడిపోయినా..విజయవాడ వాసులకు అండగా ఉంటానని చెప్పారు. కానీ, ఇప్పటి వరకు ఐపు లేకుండా పోయారు. మరో ఏడాదిలో ఎన్నికలు ఉన్నప్పటికీ.. ఇప్పటి వరకు వైసీపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా తెరమీదికి రాలేదు.
ఇదిలావుంటే.. టీడీపీ తరఫున ఎవరు నిలబడ్డా.. వారి గెలుపునకు సాయం చేస్తానని.. ప్రస్తుత ఎంపీ కేశినేని శ్రీనివాస్ చెబుతున్నారు. అయితే.. ఆయనకే టికెట్ ఇస్తారని.. పార్టీ నాయకులు చెబుతున్నారు. గ్రామీణ స్థాయిలో పట్టు పెంచుకున్న కేశినేని.. గెలుపు అనివార్యంగా మారిందనే సంకేతాలు వస్తున్నాయి. ఈ విధంగా ఈ రెండు నియోజకవర్గాల్లోనూ.. టీడీపీ గెలుపు గుర్రం ఎక్కడం ఖాయమని అంటున్నారు. కానీ, సర్వే మాత్రం 24 నియోజకవర్గాల్లో వైసీపీ గెలుస్తుందని పేర్కొనడాన్ని బట్టి అసలు క్షేత్రస్థాయిలో సర్వే చేశారా? పోసుగోలు కబుర్లు చెప్పారా? అనే చర్చ సాగుతోంది. జిల్లాల వారీగా వివరిస్తే.. మరిన్ని నియోజకవర్గాల్లో వైసీపీకి వ్యతిరేకత ఎంతుందో తెలుస్తుందని అంటున్నారు.
ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో ఎక్కువ ఎడ్జ్ ఉన్నది మెకానిక్ రాకీకే. విశ్వక్ సేన్ హీరోగా మీనాక్షి చౌదరి,…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 ట్రైలర్ విడుదలైన తర్వాత ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. సుకుమార్ ఏదో…
నిన్న జరిగిన పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒకవేళ హైదరాబాద్ అయ్యుంటే ఎలా ఉండేదో కానీ పాట్నాలో వచ్చిన…
హైదరాబాద్ ఫుడ్ కు దేశంలోనే కాదు వరల్డ్ వైడ్ గా మంచి క్రేజ్ ఉంది. సెలబ్రెటీలులకు సైతం గౌరవం ఎక్కువ.…
సూపర్ స్టార్ మహేశ్ బాబు లేటెస్ట్ లుక్ ప్రస్తుతం అభిమానుల మధ్య హాట్ టాపిక్ అయింది. ఇటీవలి కాలంలో గడ్డం,…
దర్శక ధీరుడు రాజమౌళి మొదటి నుంచి ఒక సెట్ ఆఫ్ టెక్నీషియన్లతో పని చేస్తూ వచ్చాడు. ఆయన సినిమాలకు ఇప్పటిదాకా…