ఇండియన్ ప్రీమియర్ లీగ్లో నాలుగుసార్లు ఛాంపియన్ అయిన చెన్నై సూపర్‌కింగ్స్.. 16వ సీజన్‌లో బోణీ కొట్టింది. 12 పరుగుల తేడాతో లఖ్‌నవూ సూపర్‌జెయింట్స్‌ను ఓడించింది. 218 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన లఖ్నవూలో.. మేయర్స్ ఉన్నంతసేపు ఛేదన కష్టమేమీ కాదనే అనిపించింది. తమ ఫస్ట్ మ్యాచ్లో దిల్లీపై చెలరేగిపోయిన ఈ విండీస్ వీరుడు.. చెన్నై మీదా కూడా అదే దూకుడు ప్రదర్శించాడు. దొరికిన బంతిని దొరికినట్లుగా బాదుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. అయితే.. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. తమ బౌలర్లకు గట్టి వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది.
ఎక్స్‌ట్రాలు ఎక్కువగా ఇస్తుండటం వల్ల వారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. గత రాత్రి(ఏప్రిల్ 3) చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా లఖ్నవూతో జరిగిన మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో సీఎస్కే విజయాన్ని సాధించింది. అయితే ఈ విజయం.. బ్యాటర్ల భారీ స్కోరు చేయడంతో దక్కింది. బౌలర్లు అంతగా ఆకట్టుకోలేకపోయారు. దీంతో బౌలర్ల ప్రదర్శనపై దోనీ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
నోబాల్స్, వైడ్స్ తక్కువగా వేసేందుకు ప్రయత్నించాలని.. లేదంటే ఇకపై కొత్త కెప్టెన్ ఆధ్వర్యంలో ఆడాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేశాడు. కాగా, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే బౌలర్లు మొత్తం 18 ఎక్స్‌ట్రాలు వేశారు. ఇందులో రెండు లెగ్‌బైస్, 13 వైడ్లు, మూడు నోబాల్స్ ఉన్నాయి. వీరిలో బౌలర్ తుషార్ దేశ్‌పాండే మూడు నోబాల్స్ వేశాడు.
“ఫాస్ట్ బౌలింగ్‌ను మేం బాగా మెరుగుపరుచుకోవాలి. పరిస్థితులకు తగ్గట్టుగా బౌలింగ్ చేయాలి. ప్రత్యర్థి బౌలర్లు ఏం చేస్తున్నారు, వారి వ్యూహాలు ఏంటి అనేది కూడా గమనించడం ఇక్కడ చాలా ముఖ్యం. ముఖ్యంగా బౌలర్లు నోబాల్స్ వేయకుండా బంతులను సంధించాలి. ఎక్స్‌ట్రా వైడ్లు తగ్గించాలి. ఈ మ్యాచ్‌లో మేం అదనపు పరుగులు ఎక్కువగా ఇచ్చేశాం. వాటిని తగ్గించాలి. లేదంటే ఇక కొత్త కెప్టెన్సీలో మా జట్టు ఆడుతుంది. ఇది నా సెకండ్ వార్నింగ్. ఇకపై ఇదే తప్పు జరిగితే సారథ్యం నుంచి తప్పుకుంటా” అని మహీ హెచ్చరించాడు.
This post was last modified on April 4, 2023 4:38 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…