ప్రపంచంలోని కొన్ని దేశాల్లో అసలేం జరుగుతుందో అస్సలు బయటకు రావు. ఆ కోవలోకే వస్తుంది రష్యా. సుదీర్ఘకాలం కమ్యునిస్టుల ఏలుబడిలో సాగిన ఆ దేశం.. ఇప్పుడు పుతిన్ పుణ్యమా అని ప్రజాస్వామ్య నియంతృత్వంలో సాగుతోంది. ఇటీవల రాజ్యాంగంలో చేసిన మార్పులతో పుతిన్ జీవితకాల అధ్యక్షుడిగా ప్రకటించుకున్నట్లుగా వార్తలు రావటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. కరోనాకు చెక్ పెట్టే వ్యాక్సిన్ ను తాము సిద్ధం చేస్తున్నట్లుగా చెప్పి అందరిని ఆశ్చర్యపరిచిందా దేశం.
ఎందుకంటే.. రష్యా నుంచి ప్రకటన వచ్చే వరకూ ఆ దేశంలో కరోనా వ్యాక్సిన్ మీద సాగుతున్న ప్రయోగాల మీద ప్రపంచం పెద్దగా ఫోకస్ చేసింది లేదు. అందుకు భిన్నంగా త్వరలో టీకాను తీసుకొచ్చేస్తున్నట్లు చెప్పి అందరిని ఆశ్చర్యంలోకి ముంచెత్తారు. అయితే.. ఇదేమీ సాధ్యం కాదన్న మాట వినిపించింది.
ఇందుకు భిన్నంగా తాజాగా మరో ఆసక్తికర ప్రకటన బయటకు వచ్చింది. ఆగస్టు పది నుంచి పన్నెండు తేదీల్లోగా కరోనాకు టీకాను తాము విడుదల చేయనున్నట్లుగా రష్యా చెబుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
గామాలెయ ఇన్ స్టిట్యూట్ రూపందించిన ఈ టీకాకు సాధ్యమైనంత త్వరగా అనుమతి ఇవ్వాలన్న ఆలోచనలో రష్యా ఉన్నట్లు చెబుతున్నారు. ఇదే విషయాన్ని చెబుతూ బ్లూమ్ బర్గ్ ఒక కథనాన్ని ప్రచురించింది. ఇప్పటికే మానవ ప్రయోగాల దశ కూడా స్టార్ట్ అయ్యిందని.. జులై 27నఐదుగురు వాలంటీర్లకు టీకాలు ఇచ్చినట్లుగా చెబుతున్నారు. వారు ఎలాంటి అనారోగ్య సమస్యల్ని ఎదుర్కోలేదని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. టీకాను విడుదల చేయాలన్న తొందరలో రష్యా భద్రతా ప్రమాణాలు పాటించటం లేదని చెబుతున్నారు. మరి.. ఇలాంటి వేళ రష్యా తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్ మీద అంతర్జాతీయ మీడియాలో వస్తున్న కథనాలు ఏ మేరకు నిజమవుతాయో చూడాలి.
This post was last modified on %s = human-readable time difference 12:15 pm
అత్త మీద కోపం దుత్త మీద చూపిస్తే పనయ్యే రోజులు కావివి. అలా చేయొచ్చనుకోవడమే అసలు కామెడీ. ఇటీవలే కన్నడ,…
హీరోయిన్లకు ఒక్కోసారి కెరీర్ లో స్పీడ్ బ్రేకర్ లాంటి దశ వస్తుంది. అప్పుడు ఎంత బ్లాక్ బస్టర్ సాధించినా అవకాశాలు…
పిఠాపురంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్న సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆడపిల్లలను అవమానిస్తుంటే చర్యలు తీసుకోరా?…
తమిళ స్టార్ విజయ్ తేరి తెలుగులో పోలీసోడుగా డబ్బింగ్ చేసినప్పుడు మన ప్రేక్షకులు అంతగా పట్టించుకోలేదు. మొదటిసారి థియేటర్లో చూసిన…
గంభీర్ కోచ్ గా KKK జట్టుకు అందించిన విజయాలు అందరిని ఎంతగానో ఎట్రాక్ట్ చేశాయి. అతను ఏది చెబితే అది…
కష్టపడితే అందలం ఎక్కించే టాలీవుడ్ పరిశ్రమలో దాన్ని సాధ్యం చేసుకునే వాళ్ళు కొందరే ఉంటారు. సరైన ప్లానింగ్ తో మంచి…