ఏపీలో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. తిరుమల, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు నగరాల్లో 5జీ సేవలను ప్రారంభించారు. మంత్రి గుడివాడ అమర్‌నాథ్ విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో ‘జియో ట్రూ 5జీ’-‘ జియో ట్రూ 5జీ పవర్డ్ వై-ఫై’ సేవలను ఆవిష్కరించారు.
మంత్రి అమర్‌నాథ్ మాట్లాడుతూ , “ఆంధ్రప్రదేశ్‌లో జియో ట్రూ 5 జికి ఇప్పటికే ఉన్న పెట్టుబడి రూ .26,000 కోట్లతో పాటు, అదనంగా జియో రూ .6,500 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టింది. ఇది మన రాష్ట్ర అభివృద్ధి పట్ల వారి అపారమైన నిబద్ధతను చూపిస్తుంది. 2023 డిసెంబర్ నాటికి ప్రతి పట్టణం, తాలూకా, మండలం, గ్రామాల్లో జియో ట్రూ 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయి” అని చెప్పారు.
కాగా, జియో ట్రూ 5జి సేవల ప్రారంభంతో రాష్ట్రంలో ఉత్తమ టెలికమ్యూనికేషన్ నెట్ వర్క్ ను పొందవచ్చని ప్రభుత్వం పేర్కొనడం గమనార్హం. ఇ-గవర్నెన్స్, విద్య, ఆరోగ్య సంరక్షణ, ఐటి మరియు ఎస్ఎమ్ఇ వ్యాపార రంగాలలో వృద్ధి అవకాశాలకు తలుపులు తెరుస్తుందని తెలిపింది. జియో ట్రూ 5 జి పౌరులు, ప్రభుత్వం రియల్ టైమ్ ప్రాతిపదికన కనెక్ట్ అయ్యేందుకు వీలు కల్పిస్తుందని పేర్కొంది. చిట్టచివరి అడుగు వరకు ప్రభుత్వ పథకాల అమలు సామర్థ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని సర్కారు తెలిపింది. జియో ట్రూ 5జీ నెట్ వర్క్ అతి తక్కువ సమయంలోనే రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనుంది.
This post was last modified on December 27, 2022 11:38 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…