వందల కోట్ల రూపాయిల పెట్టుబడులు అక్కర్లేదు. నిత్యం కోట్లాది రూపాయిలు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. ఒక్కసారి అప్లికేషన్ పక్కాగా సిద్ధం చేసి.. ఎప్పటికప్పుడు దాన్ని డెవలప్ చేసుకుంటూ పోతే.. వేలాది కోట్లు సొంతమయ్యే అవకాశం ఒక్క ఐటీలోనే సాధ్యం. తాజాగా అలాంటి మార్కెట్ గురించి మాట్లాడుకోవటం ఎక్కువైంది. కరోనా పుణ్యమా అని.. ఇప్పుడు ఎవరికి వారు ఇళ్లల్లోనే ఉండిపోవటం.. వ్యాపారకార్యకలాపాలు మొదలు విద్య.. వైద్యం.. రాజకీయం.. ఇలా ఒకటి కాదు రెండు కాదు అన్ని రంగాలు ఆన్ లైన్ లోకి వచ్చేస్తున్న వైనం తెలిసిందే.
మొయిల్స్ ద్వారా సంప్రదింపులు జరిపటానికి బదులుగా.. వీడియో కాన్ఫరెన్సుల్లో మాట్లాడుకోవటం.. ఒకేసారి వందల మంది ఈజీగా కనెక్టు అయ్యేలా చేసే జూమ్ తరహా యాప్ లకు ఇవాళ డిమాండ్ పెరిగింది. లాక్ డౌన్ వేళ.. అందరికి సుపరిచితంగా మారిన జూమ్ యాప్ ఒక వెలుగు వెలిగింది. అంతలోనే.. ఆ యాప్ మీద చైనా ముద్ర పడింది. వాస్తవానికి తమది చైనా యాప్ కాదని మొత్తుకున్నా.. దాని మీద ఆ ముద్ర పోని పరిస్థితి. ఇదిలా ఉంటే.. జూమ్ యాప్ భద్రతా పరంగా ఏ మాత్రం సేఫ్ కాదన్న ఆరోపణలు వచ్చాయి.
తమ మీద వచ్చిన ఆరోపణల్ని మొగ్గలోనే తుంచేసే విషయంలో కంపెనీ వేసిన తప్పటడుగులు ఇప్పుడా కంపెనీకి శాపంగా మారాయి. ఇదిలా ఉండగా.. జూమ్ కు ప్రత్యామ్నాయంగా గూగుల్ మీటింగ్ యాప్ రావటం.. ఈ మధ్యనే జియో మీట్ యాప్ రావటంతో వాతావరణం వేడెక్కింది. పెద్ద పెద్ద కంపెనీలు వీడియో కాన్ఫరెన్ సువ్యాపారంలోకి ఎందుకు వస్తున్నాయన్న విషయంలోకి వెళితే.. షాకింగ్ అంశాలు బయటకు వస్తాయి.
ఈ వ్యాపార మార్కెట్ విలువ ఏకంగా రూ.30వేల కోట్లు ఉండటమే కారణం. అది కూడా 2019 లో జరిగిన వ్యాపారం ఇంత ఉంటే.. రానున్న రోజుల్లో మరెంత ఉండనుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కరోనా పుణ్యమా అని ప్రపంచంలోని అన్ని పెద్ద సంస్థలు వీడియోకాన్ఫరెన్సును ఉపయోగించక తప్పని పరిస్థితి. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో దీని వినియోగం మరింత పెరగటం ఖాయం.
ఈ కారణంతోనే జియో లాంటి కంపెనీ కూడా పరుగు పరుగున జియో మీట్ ను అందుబాటులోకి తీసుకొచ్చిందని చెబుతున్నారు. అయితే.. జియో తీసుకొచ్చిన ఈ యాప్.. జూమ్ ను పోలి ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తమ యాప్ ను కాపీ కొట్టినట్లుగా జూమ్ చెప్పటమే కాదు.. రిలయన్స్ మీద కేసు వేసేందుకు సిద్ధమవుతోంది. చూస్తుంటే రానున్న రోజుల్లో వీడియో కాన్ఫరెన్సుల వ్యాపారంలో పెద్ద లొల్లే చోటు చేసుకోవటం ఖాయమన్న అభిప్రాయం కలుగక మానదు.
This post was last modified on August 12, 2020 6:32 pm
2008లో విడుదలైన చిత్రం ‘సిద్దూ ఫ్రమ్ సికాకుళం’ తో తన సినీ జీవితాన్ని ప్రారంభించింది శ్రద్ధాదాస్. తొలి చిత్రంతోనే యూత్ లో…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను అమితంగా ఇష్టపడే యంగ్ హీరోల్లో నేచురల్ స్టార్ నాని ఒకడు. అతను సినిమాల్లోకి రాకముందే…
చిన్న ఆర్టిస్టుగా మొదలుపెట్టి సోలో హీరోగా వరస అవకాశాలు చేజిక్కించుకునే దాకా సత్యదేవ్ పడిన కష్టం అంతా ఇంతా కాదు.…
కాంగ్రెస్ పార్టీకి మహారాష్ట్రలో ఘోర పరాభవం ఎదురైనా.. ఆపార్టీ వారసురాలు.. అగ్రనాయకురాలు, ఇందిరమ్మ మనవరాలు.. ప్రియాంక గాంధీ విషయంలో మాత్రం…
ఏపీ విపక్షం వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఇటీవల కాలంలో కొంత ప్రశాంతంగా ఉన్న వైసీపీ రాజకీయాలు .. ఇప్పుడు…
జైలుకు వెళ్లిన నాయకుల పట్ల ప్రజల్లో సానుభూతి ఉంటుందని చెప్పేందుకు.. మరో ఉదాహరణ జార్ఖండ్. తాజాగా ఇక్కడ జరిగిన ఎన్నికల్లో…